బరి తెగించిన ఆకతాయిలు

ABN , First Publish Date - 2022-09-20T04:40:41+05:30 IST

బరి తెగించిన ఓ ఆకతాయిల ముఠా పక్క రాష్ట్రంలోని ఓ కుటుంబంపై దాడికి పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం తెలంగాణలో ఆయు ర్వేద వైద్య చికిత్సకు వచ్చి తిరిగి వెళ్తుండగా రాత్రి సమయంలో ఆకతాయిలు వాహనాన్ని వెంబడించి, అడ్డగించి దాడి చేసిన సంఘటన రఘనాథపాలెం మండలం వీ వెంకటాయ పాలెంలో జరిగింది

బరి తెగించిన ఆకతాయిలు

ఏపీ వాసుల వాహనాన్ని వెంబడించి, అడ్డగించి దాడి

బాధితుల ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు

రఘనాథపాలెం, సెప్టెంబరు 19: బరి తెగించిన ఓ ఆకతాయిల ముఠా పక్క రాష్ట్రంలోని ఓ కుటుంబంపై దాడికి పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం తెలంగాణలో ఆయు ర్వేద వైద్య చికిత్సకు వచ్చి తిరిగి వెళ్తుండగా రాత్రి సమయంలో ఆకతాయిలు వాహనాన్ని వెంబడించి, అడ్డగించి దాడి చేసిన సంఘటన రఘనాథపాలెం మండలం వీ వెంకటాయ పాలెంలో జరిగింది. ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. ఏపీలోని కృష్ణ జిల్లా తిరువూరు శాంతినగర్‌కు చెందిన వేమూరి పవన్‌కుమార్‌ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ జీవనం సా గిస్తున్నారు. కుటుంబంలోని ఓ వ్యక్తికి క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతుండటంతో హన్మకొండకు సమీపంలోని చింతగట్టుకు కారులో వెళ్లి ఆయుర్వేదం మందులు తీసుకొని తిరుగు ప్రయాణ మయ్యారు. సోమవారం ఉదయం 3గంటల ప్రాంతంలో ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్‌కు చేరుకున్న కా రును కొంతమంది ఆకతాయిలు మద్యం తాగి కారుతో వెంబడించారు. కారును పలుమార్లు అ డ్డగించే ప్రయత్నం చేశారు. వీ.వెంకటాయపాలెం సమీపంలోని ఓ దాబా వద్దకు రాగానే వే మూరి పవన్‌కుమార్‌ ప్రయాణిస్తున్న కారును అడ్డగించి కారు అద్దాలను ధ్వంసం చేసి చె ప్పనలవి కాని రీతిలో బూతులు తిడుతూ ఆందోళనకు గురి చేశారు వెంటనే డయల్‌ 100కు బాధితులు ఫిర్యాదు చేయటంతో ఖానాపురం పోలీసు సిబ్బంది ఆకతాయిలను, కారును అదు పులోకి తీసుకొని విచారణ చేపట్టారు. నిందితులుగా ఖమ్మం నగరంలోని రాపర్తినగర్‌కు చెంది న సండ్ర శ్రావణ్‌కుమార్‌, నూకారపు కోటేశ్వరరావు, నూకారపు నరేశ్‌పై రఘనాథపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.


Read more