భర్తపై బాత్‌రూమ్‌ యాసిడ్‌తో భార్య దాడి

ABN , First Publish Date - 2022-10-12T04:43:10+05:30 IST

చిన్న పాటి గొడవను మనసులో పెట్టుకొని భర్త ముఖంపై భార్య బాత్‌రూమ్‌ యాసిడ్‌తో దాడి చేసింది.

భర్తపై బాత్‌రూమ్‌ యాసిడ్‌తో భార్య దాడి

రఘునాథపాలెం, అక్టోబరు 11: చిన్న పాటి గొడవను మనసులో పెట్టుకొని భర్త ముఖంపై భార్య బాత్‌రూమ్‌ యాసిడ్‌తో దాడి చేసింది. ఈ సంఘటన రఘునాథపాలెం మండలంలో జరిగింది. ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. రేగులచెలకకు చెందిన ఉబ్బని రవి, సుజాత భార్యభర్తలు, వీరికి ఒక బాబు ఉన్నాడు. కొంతకాలంగా చిన్న చిన్న విషయాలపై ఇరువురి మద్య గొడవలు జరుగుతున్నాయి. అయితే సోమవారం రాత్రి బాబును ఎత్తుకునే విష యంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మంగళవారం ఉదయం లేచిన రవి పని కోసం ఖమ్మం బయలుదేరి గ్రామంలో కూడలిలో ఆటో కోసం నిలిచిఉన్నాడు. ఈ క్రమంలో సుజాత ఇంట్లోని బాత్‌రూమ్‌ యాసిడ్‌ను వాటర్‌ బాటిల్‌లో తీసుకొచ్చి రోడ్డుపై నిలిచి ఉన్న రవి ముఖం పై పోసింది. ఆయనతో పాటుగా సమీపంలోనే ఉన్న మరో వ్యక్తి కన్నెపోగు కిరణ్‌పై పడటంతో గాయపడ్డాడు. యాసిడ్‌తో దాడి చేసిన భార్యంపై భర్త రవి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సుజాతపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read more