మూగ, చెవిటి యువతిపై అత్యాచార యత్నం

ABN , First Publish Date - 2022-09-20T04:44:48+05:30 IST

కల్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మూగ, చెవిటి యువతిపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి యత్నించాడు

మూగ, చెవిటి యువతిపై అత్యాచార యత్నం

కల్లూరు, సెప్టెంబరు. 19: కల్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మూగ, చెవిటి యువతిపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి యత్నించాడు. ఈ సంఘ టనపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మూగ, చెవిటి, మానసిక దివ్యాంగురాలైన యువతి ఆదివారం తన ఇంటి వద్ద ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నరేందర్‌ అనే యువకుడు అత్యాచారానికి యత్నించాడు. సదరు యువతి కేకలు వేయటంతో నిందితుడు పరారయ్యాడు.. ఈ మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిపై అత్యాచారయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపారు. 

Read more