ప్రతిష్టాత్మకంగా మన ఊరు- మనబడి
ABN , First Publish Date - 2022-02-19T06:19:46+05:30 IST
ప్రతిష్టాత్మకంగా మన ఊరు- మనబడి

ఖమ్మం జిల్లాలో తొలివిడతలో 426పాఠశాలల ఎంపిక
‘దళితబంధు’ను పారదర్శకంగా అమలు చేయాలి
ప్రభుత్వ పథకాలపై మంత్రి అజయ్‌కుమార్ సమీక్ష
సమావేశానికి హాజరైన సీఎల్పీనేత భట్టి విక్రమార్క
ఖమ్మం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మనబడి, దళితబంధు పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని, వీటిని జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని రవాణా వాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. ఖమ్మం కలెక్టరేట్ లోని ప్రజ్ఞాసమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మన ఊరు-మనబడి, మనబస్తీ -మనబడి, దళితబంధు కార్యక్రమాలపై ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. ఈ పథకాలపై ప్రభుత్వ విధి విధానాలను మంత్రి పువ్వాడ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యరంగాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కలిపించబోతున్నామని తెలాపారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో చేపట్టే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.7,600కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మొదటిదశగా రాష్ట్ర వ్యాప్తంగా 9,123 పాఠశాలలకు రూ.3497కోట్లు కేటాయించినట్లు తెలి పారు. ప్రాధాన్యతక్రమంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీటి సౌకర్యం, ఫర్నీచర్, పాఠశాలకు పెయింటింగ్ వంటి సదుపాయాలు కలిపిస్తామన్నారు. డిజిటల్ విద్యాబోధన అమల్లోకి వస్తుం దని తెలిపారు. ఖమ్మం జిల్లాలో మొదటి విడతగా 426పాఠశాలలను ఎంపిక చేసినట్లు మంత్రి వివరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీచైర్మన్ తమ నియోజకవర్గాల పరిధిలో మొదటి దశ కింద ఎంపికచేసిన పాఠశాలల నిర్వహణ కమిటీలు, మండల విద్యా శాఖ అధికరులతో సమావేశమై మన ఊరు-మనబడి కార్యక్రమం గురించి వివరించాలన్నారు. పాఠశాలల అభి వృద్ధికి పూర్వవిద్యార్థులు, ప్రవాస భారతీ యుల సహకారం తీసుకుంటామని తెలి పారు. మొదటి విడత ఎంపిక చేసిన పాఠశాలల్లో సమస్యలను సత్వరం గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయా లని, సూచించారు. మంత్రి తనవంతుగా ఈ కార్యక్రమానికి రూ.50లక్షలు సమకూర్చుతున్నట్టు తెలిపారు. దళతబంధు పథకం విజయవంతంగా నిర్వహించాలని, నియోజకవర్గానికి వంద యూనిట్లు కేటాయించడం జరిగిందని, పారదర్శకంగా ఈ పథకం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి లబ్దిదారుడి ఇంటి వద్దకు వెళ్లి అధికారులు విచారించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ మన ఊరు-మనబడి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిందని తెలిపారు. కార్యక్రమం నిర్వహించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక బ్యాంకు ఖాతా, పాఠశాల స్థాయిలో పాఠశాల నిర్వాహణ కమిటీ ఆధ్వర్యంలో బ్యాంకు ఖాతాలు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో దాతలను ప్రోత్సహిచి భాగస్వామ్యులను చేయాలని సూచించారు. ఎమ్మెల్సీలు తాతా మధుసూదనరావు, నర్సిరెడ్డి, ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, రాములునాయక్ జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్ తదితరులు మన ఊరు-మనబడి కార్యక్రమం, దళితబంధు పథకాలు అమలుపై పలు సలహాలు-సూచనలు అందించారు. కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ నీరజ, పురపాలక కమిషనర్ ఆదర్శసురభి, అదనప కలెక్టర్ మధుసూదన్, డీఆర్వో శిరీష, డీఈవో యాదయ్యతో పాటు ఖమ్మం, కల్లూరు ఆర్డీవోలు రవీంద్రనాద్, సూర్యనారాయణ, ఆర్అండ్బీ ఎస్ఈ చంద్రమౌళి, ఈఈ శ్యాంప్రసాద్, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.