ప్రజలంతా కాంగ్రెస్‌ వైపే: సంబాని

ABN , First Publish Date - 2022-06-11T05:51:47+05:30 IST

రాష్ట్రంలో ప్రజలంతా కాంగ్రెస్‌ వైపే చూస్తున్నారని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీమంత్రి సంబానీ చంద్రశేఖర్‌ అన్నారు.

ప్రజలంతా కాంగ్రెస్‌ వైపే: సంబాని

పెనుబల్లిరూరల్‌, జూన్‌ 10: రాష్ట్రంలో ప్రజలంతా కాంగ్రెస్‌ వైపే చూస్తున్నారని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీమంత్రి సంబానీ చంద్రశేఖర్‌ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఎడ్లబంజర గ్రామ పంచాయతీలోని రంగారావుబంజర్‌, చౌడవరం, అడవిమల్లేల తదితర గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ను గ్రామగ్రామాన తెలియజేసేందుకు ఈ రచ్చబండ కార్యక్రమం విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రూ.2లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని, గతంలో కూడా ఏకకాలంలో రైతులకు దీనిని అమలు చేసిన ఘనత కాంగ్రె్‌సదేనన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను వరి వేసుకుంటే ఉరేనని చెప్పిన కేసీఆర్‌ మాత్రం తన ఫామ్‌హౌ్‌సలో దర్జాగా వరి వేసుకున్నట్లు చెప్పారు. కాంగ్రె్‌సకు ఓటేస్తే ఇందిరమ్మ రైతుభరోసా పథకాలను తీసుకిచ్చి భూమి ఉన్నాలేకున్నా కౌలు చేస్తున్న రైతులకు ఏడాదికి రూ.15వేలు ఇస్తుందన్నారు. ధరణీ పోర్టల్‌ను పూర్తిగా రద్దుచేసి రైతులకు సులభమైన వెబ్‌సైట్‌ రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు చెలికాని రాజబాబు, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి రామిశెట్టి మనోహర్‌నాయుడు, నాయకులు నరేంద్రకుమార్‌, పులి రాంబాబు, పులి గౌతమ్‌ పాల్గొన్నారు.


Read more