అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ

ABN , First Publish Date - 2022-12-06T23:07:38+05:30 IST

పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు యాజమాన్యం అప్రమత్తతే ప్రధానమని అసి స్టెంట్‌ కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు అన్నారు.

అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ
సమీక్షలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌

అశ్వాపురం డిసెంబరు 6: పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు యాజమాన్యం అప్రమత్తతే ప్రధానమని అసి స్టెంట్‌ కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం గౌతమీనగర్‌ కాలనీలోని ప్లాంట్‌ అతిధిగృహంలో జరిగిన ఆఫ్‌సైట్‌ ఎమర్జెన్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు ప్లాంట్‌ అధికారులు హెవీవాటర్‌ ప్లాంట్‌లో ప్రమాదవశాత్తూ హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ విషవాయువు లీకయినప్పుడు తీసుకుంటున్న చర్యలపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం నిజంగా విషవాయువు లీక్‌అయినట్లు ప్రకటించి ఆఫ్‌సైట్‌ ఎమర్జెన్సీ పరిధిలోని అమ్మగారిపల్లి గ్రామంలో మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. అనంతరం అధికారులతో జరిగిన సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ మాట్లాడారు. ప్రమాదాల నివారణకు హెవీవాటర్‌ ప్లాంట్‌ లో అధికారులు తీసుకుంటున్న చర్యలు బేష్‌ అన్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ప్రాణ, ఆస్థి నష్టాలు జరగకుండా ప్లాంట్‌ అధికారులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో ప్లాంట్‌ జీఎం కెవి.తాలే, డీజీఎంలు హరిప్రసాద్‌, జగ్గారావు, పిజెవి.సుధాకర్‌, సీఏవో కాంబ్లి, సీఐఎస్‌ఎఫ్‌ కమాండెంట్‌ వినోద్‌బాబు, వైద్యాధికారి విజయ్‌కుమార్‌, ప్రొడక్షన్‌ మేనేజరు శ్రీనివాసరావు, సేఫ్టీ అధికారి శర్మ, తహశీల్ధార్‌ సురేష్‌కుమారు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:07:53+05:30 IST