పైలాన్‌ ఫెన్సింగ్‌ కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-02-20T04:55:14+05:30 IST

మండలంలోని సుబ్లేడు క్రాస్‌రోడ్డు వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ పెన్షింగ్‌ను కొంతమంది కూల్చివేశారని వారిపై చర్యలు తీసుకోవాలని, టీడీపీ పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు కొండబాల కరుణాకర్‌, రాష్ట్ర కార్యదర్శి చేతుల నాగేశ్వరరావు, డిమాండ్‌ చేశారు.

పైలాన్‌ ఫెన్సింగ్‌ కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలి

తిరుమలాయపాలెం, ఫిబ్రవరి19: మండలంలోని సుబ్లేడు క్రాస్‌రోడ్డు వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ పెన్షింగ్‌ను కొంతమంది కూల్చివేశారని  వారిపై చర్యలు తీసుకోవాలని, టీడీపీ పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు కొండబాల కరుణాకర్‌, రాష్ట్ర కార్యదర్శి చేతుల నాగేశ్వరరావు, డిమాండ్‌ చేశారు. శనివారం మండలంలోని సుబ్లేడు క్రాస్‌రోడ్డు వద్ద కూల్చివేసిన పైలాన్‌ ఫెన్సింగ్‌ను వారు పరిశీలించారు ఈప్రాంతంలో భూములు ఆక్రమించుకునేందుకు కొంతమంది వ్యక్తులు పైలాన్‌ చుట్టు ఫెన్సింగ్‌ను కూడా జేసీబీ సహాయంతో తొలిగించారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాయపుడి జయకర్‌, నాగార్జున, అప్పారావు, రాజరాజేశ్వరి, మండల అధ్యక్షుడు నామా ప్రసాద్‌, ప్రదాన కార్యదర్శి ఇస్లావత్‌ ప్రసాద్‌, సాలయ్య పాల్గొన్నారు.

Read more