90మంది విద్యార్థినులకు అస్వస్థత

ABN , First Publish Date - 2022-12-13T23:56:31+05:30 IST

బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు

90మంది విద్యార్థినులకు అస్వస్థత
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలు

కలుషితాహారంతో వాంతులు, కడుపునొప్పి

తొలిరోజు 29మంది, రెండో రోజు 61మంది ఆసుపత్రికి తరలింపు

వైద్యుల చికిత్సతో కోలుకున్న బాలికలు

పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు

జూలూరుపాడు, డిసెంబరు 13: ఆహారం కలుషితం కావడంతో రెండో రోజు మంగళవారం మండలంలోని పడమట నర్సాపురంలోని ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 550మంది విద్యార్థినులు ఉన్న ఆశ్రమ పాఠశాలలో తొలిరోజు సోమవారం రాత్రి 29మంది అస్వస్థతకు గురికాగా వారిని జూలూరుపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. రెండో రోజు 61మంది బాలికలు తెల్లవారుఝాము నుంచే వాంతులు, విరోచనాలు, కడుపునొప్పితో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో వారిలో 15మందిని తొలుత సిబ్బంది చికిత్స అందించేందుకు జూలూరుపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంతమంది బాలికలకు ప్లూయిడ్స్‌ ఎక్కించారు. పాఠశాలలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి 46మంది బాలికలకు పరీక్షలు నిర్వహించి మందులను అందచేశారు. అయినప్పటికి వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో 108 వాహనాల్లో బాలికలందర్ని జూలూరుపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందచేశారు. వారికి ఎలాంటి ప్రమాదం లేదని, కొలుకోవడంతో వసతిగృహానికి పంపించినట్లు వైద్యాధికారి శ్రీధర్‌ తెలిపారు.

తల్లిదండ్రుల ఆందోళన

ఆదివారం కోడిమాంసం, సోమవారం క్యాబేజీ కూరతో సిబ్బంది భోజనాన్ని అందచేసినట్లు బాలికలు తెలిపారు. ఆహారం కలుషితం కావడంతోనే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు వైద్య సిబ్బంది తెలిపారు. పాఠశాలలో తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలుసుకు ని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థినుల తల్లిదండ్రు లు పాఠశాలకు వచ్చారు. జరిగిన సంఘటన పై అడిగి తెలుసుకుని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలు అస్వస్థతకు గురికావడంతో వారు ఆందోళన చెందారు. ఈ కార్యక్రమంలో సీహెచవో వెంకటేశ్వర్లు, సిబ్బంది సుభద్ర, కృష్ణ, జానకీరాం, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సందర్శించిన పలుశాఖల అధికారులు

బాలికలు అస్వస్థతకు గురికావడంతో ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ డీడీ రమాదేవి, ఐటీడీఏ ఏటీడీవో రూపాదేవిలు సందర్శించి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. బాలికల ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. బాలికలకు అందచేసిన ఆహారం ఉడక్క పోవడంతోనే వారు అస్వస్థతకు గురయ్యారని, ఆహారం కలుషితం కాలేదని డీడీ తెలిపారు. బాలికలతో కలిసి భోజనం చేశారు. వైద్యశాఖ జిల్లా సర్వేలైన్స అధికారి ఇమ్మానియేలు పాఠశాలను సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భోజన పదార్థాలను, తాగునీటిని పరిశీ లించి భోజన పదార్థాలను, నీటి నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్‌ లూథర్‌ విల్సన, ఎస్‌ఐ పోటు గణేష్‌ పాఠశాల, ఆసుపత్రిని సందర్శించారు. మిషన భగీరఽథ మైక్రో బయాలజిస్ట్‌ వరుణ్‌ తాగునీటి శాంపిల్స్‌ను సేకరిం చారు. సర్పంచ కట్రం మోహనరావు, ఎంపీటీసీ సభ్యులు ఖాజా విజయరాణి, వార్డుసభ్యులు ఖాజా రమేష్‌ పాఠశాలకు వచ్చి బాలికల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2022-12-13T23:57:17+05:30 IST