VHP Protest: ఖైరతాబాద్ గణేష్ వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-08-31T18:37:03+05:30 IST
ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad maha ganapati) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ (BJP) ఎమ్మెల్యే రాజా సింగ్ (Rajasingh)ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వీహెచ్పీ (VHP) నేతలు ఆందోళనకు దిగారు. రాజా సింగ్ (BJP MLA)ను వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. ఫ్ల కార్డులు పట్టుకొని ఖైరతాబాద్ గణేష్ ముందు వీహెచ్పీ, భజరంగ్ దళ్ నేతలు నిరసనకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్స్టేషన్లకు తరలించారు.