రేపు ముంబైకి కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-02-20T03:11:15+05:30 IST

సీఎం కేసీఆర్ ఆదివారం ముంబాయికి వెళ్ల‌నున్నారు. ఉద‌యం 11 గంట‌ల‌కు హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో ముంబైకి వెళ్ల‌నున్నారు.

రేపు ముంబైకి కేసీఆర్‌

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆదివారం ముంబాయికి వెళ్ల‌నున్నారు. ఉద‌యం 11 గంట‌ల‌కు హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో ముంబైకి వెళ్ల‌నున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట‌కు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ థాక్రేతో ఆయ‌న నివాసంలో స‌మావేశం కానున్నారు. కేసీఆర్‌తో పాటు ఆయ‌న వెంటే వెళ్లే టీంకు ఉద్ద‌వ్ థాక్రే భోజ‌నానికి ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ నివాసానికి కేసీఆర్ వెళ్ల‌నున్నారు. జాతీయ రాజ‌కీయ అంశాల‌పై ఈ సంద‌ర్భంగా చ‌ర్చించ‌నున్నారు. తిరిగి ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్‌కు వ‌స్తారు. దేశ రాజకీయాల్లో మరో కూటమి ఏర్పాటుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో కూడా కేసీఆర్ సంప్రదింపులు జరుపుతారని ప్రచారం జరుగుతోంది.

Read more