కేసీఆర్‌ను గద్దె దించాలి: బాబు దొర

ABN , First Publish Date - 2022-10-12T05:18:48+05:30 IST

కేసీఆర్‌ను గద్దె దించాలి: బాబు దొర

కేసీఆర్‌ను గద్దె దించాలి:  బాబు దొర

గోవిందరావుపేట, అక్టోబరు 11: భారత రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లను తప్పుదోవ పట్టిస్తూ రాజ్యమేలుతున్న సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలని తెలంగాణ జేఏసీ జిల్లా కన్వీనర్‌ చాప బాబుదొర అన్నారు. మండలంలోని పస్రాలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు చింత కృష్ణ అధ్యక్షతన మంగళవారం జరిగిన కార్యక్ర మంలో ఆయన పాల్గొన్నారు. కుమ్రంభీం విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. గోదావరిలోయ పరిసర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల ఇసుక మాఫియా జరుగుతున్నా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. పోడుభూములకు పట్టాలిచ్చే విషయంలో సబ్‌ కమిటీలతో తూతూమంత్రంగా సమావేశాలు నిర్వహిస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌  ముసుగులో ప్రజ లను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిసు ్తన్నారని అన్నారు. 

ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు రాజ్యాధికార జాతీయ నాయకులు నెమలి నర్సయ్య, ఎరుకల హక్కుల పోరాట సమితి ఉద్యోగుల సమైక్య జాతీయ ఉపాఽధ్యక్షుడు కూరాకుల సమ్మ య్య, వివిధ సంఘాల నాయకులు కల్తీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more