TS News: కేసీఆర్ కొత్త పార్టీపై టీఆర్ఎస్ నేతల్లో అయోమయం

ABN , First Publish Date - 2022-10-06T17:00:01+05:30 IST

టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత నేతలు అయోమయంలో పడ్డారు.

TS News: కేసీఆర్ కొత్త పార్టీపై టీఆర్ఎస్ నేతల్లో అయోమయం

వరంగల్ (Warangal): టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత నేతలు అయోమయంలో పడ్డారు. కేసీఆర్ కొత్త పార్టీ బీఎస్పీ అని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వ్యాఖ్యానించారు. సీఎం కొత్త పార్టీ పెట్టారని.. అది ఏ పార్టీ అని అక్కడికొచ్చినవారిని అడిగారు. బీఎస్పీ అని కొందరు.. బీఆర్ఎస్ అని మరికొందరు అన్నారు. బీఎస్పీని జాతీయ పార్టీగా ప్రకటించడం శుభదినమంటూ మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రజలను అయోమయంలో పడేశారు.

Read more