కేసీఆర్‌.. మోసగాడు

ABN , First Publish Date - 2022-09-25T07:56:30+05:30 IST

‘‘సీఎం కేసీఆర్‌ మోసగాడు.. ఊసరవెల్లిలా రంగులు మార్చడంలో ఆయన దిట్ట..

కేసీఆర్‌.. మోసగాడు

ఊసరవెల్లిలా రంగులు మార్చడంలో దిట్ట్ట: షర్మిల

వికారాబాద్‌/సదాశివపేట, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం కేసీఆర్‌ మోసగాడు.. ఊసరవెల్లిలా రంగులు మార్చడంలో ఆయన దిట్ట. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారు’’ అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. శనివారం వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట నుంచి ప్రారంభమైన షర్మి ల ప్రజాప్రస్థానం పాదయాత్ర బూర్గుపల్లి స్టేజీ, మేకవనంపల్లి, మేకవనంపల్లి తండా మీదుగా కొనసాగింది. అనంతరం సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు పాదయాత్ర చేరుకున్నది. ఈ సందర్భంగా మేకవనంపల్లిలో నిర్వహించిన సభలో, సదాశివపేట ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఆమె మాట్లాడారు. పోరాటాలు, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజలను సీఎం కేసీఆర్‌తో పాటు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా మోసం చేశాయని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓ దొంగ, బీజేపీ మత పిచ్చి పార్టీ అని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు గౌరవం లేకుండా పోయిందని, పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. అప్పులు లేని రైతు కుటుంబం ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలకు భరోసాగా ఉండే ఆరోగ్యశ్రీని ఎత్తేశారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని భ్రష్టు పట్టించారని ఆమె మండిపడ్డారు. 

Read more