కేసీఆర్‌ కలల బేహారి.. ప్రధాని వస్తే ఆహ్వానించరా?

ABN , First Publish Date - 2022-07-05T09:52:39+05:30 IST

కేంద్ర రాజకీయాల ను ప్రభావితం చేస్తానంటున్న టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ కలల బేహారి అంటూ కేంద్రమంత్రి ధర్మేం ధ్ర ప్రధాన్‌ వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ కలల బేహారి.. ప్రధాని వస్తే ఆహ్వానించరా?

మరిన్ని భారత్‌ బయోటెక్‌లు రావాలి: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర రాజకీయాల ను ప్రభావితం చేస్తానంటున్న టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ కలల బేహారి అంటూ కేంద్రమంత్రి ధర్మేం ధ్ర ప్రధాన్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొడితే.. కేంద్రంలో ప్రభుత్వాన్ని కూల్చుతాన న్న సీఎం కేసీఆర్‌.. కలల్లో తేలిపో యే వ్యక్తి(ముంగేరిలాల్‌)అని అన్నా రు. రెండుసార్లు రాజ్యాంగబద్ధంగా ప్రధానిగా ఎన్నికైన మోదీ.. హైదరాబాద్‌కు వస్తే సీఎం కేసీఆర్‌ ఆహ్వానించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన మూడు భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం రూపకల్పనలో హెచ్‌సీయూది కీలక పాత్ర అని అన్నారు. వర్సిటీలు విద్యార్థులకు, పరిశ్రమలకు మధ్య అనుసంధానంగా మారాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ చాన్సలర్‌ జస్టిస్‌ ఎల్‌. నర్సింహారెడ్డి, వీసీ ప్రొఫెసర్‌ బీజే రావు తదితరులు పాల్గొన్నారు. డిజిటల్‌ విద్యను ప్రొత్సహించేందుకు ప్రస్తుతమున్న 30 విద్యా టీవీ చానళ్లను త్వరలోనే కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ 260కు పెంచబోతోందని ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. నగరంలోని ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ) క్యాంప్‌సలో సోమవారం యాంపీ థియేటర్‌, మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్‌, ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్‌ ఈ.సురేశ్‌ కుమార్‌, ఓయూ వీసీ ప్రొఫెసర్‌ డి.రవీందర్‌, పాలమూరు వర్సిటీ వీసీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more