పోలీస్ వలయంలో కర్మాన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్

ABN , First Publish Date - 2022-02-23T16:21:49+05:30 IST

కర్మాన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్ పోలీస్ వలయంలో ఉంది. వజ్ర వాహనాలను పోలీసులు రంగంలోకి దింపారు.

పోలీస్ వలయంలో కర్మాన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్

హైదరాబాద్: కర్మాన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్ పోలీస్ వలయంలో ఉంది. వజ్ర వాహనాలను పోలీసులు రంగంలోకి దింపారు. భారీ పోలీస్ భద్రత నడుమ హనుమాన్ టెంపుల్ ఉంది. నిన్న గోవులను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని గోరక్షక్ సభ్యులు అడ్డుకున్నారు. గోరక్షకులపై దుండగులు కత్తులతో దాడి చేశారు. భయంతో గోరక్షకులు గుడిలోకి పరుగులు తీశారు. కత్తులతో దుండగులు సైతం ఆలయంలోకి ప్రవేశించారు. దుండగులను అరెస్టు చేయాలంటూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. 
Read more