గడువులోగా పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-12-12T23:26:20+05:30 IST

నగరంలోని వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న స్మార్ట్‌సిటీ పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు.

గడువులోగా పనులు పూర్తి చేయాలి
అశోక్‌నగర్‌ చౌరస్తాలో స్మార్ట్‌సిటీ రోడ్డు పనులను పరిశీలిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబర్‌ 12: నగరంలోని వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న స్మార్ట్‌సిటీ పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన స్మార్ట్‌సిటీ ఫేజ్‌-2 పనుల్లో భాగంగా ఓల్డ్‌ పవర్‌ హౌస్‌ నుండి నాకా చౌరస్తా వరకు చేపడుతున్న రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మట్లాడుతూ మంగళివాడ చౌరస్తా నుంచి యజ్ఞవరహస్వామి ఆలయం, నిత్యం రద్దీగా ఉండే టవర్‌సర్కిల్‌ రోడ్డు పనులను వీలైనంత మేరకు త్వరగా పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ నాంపల్లి శ్రీనివాస్‌, సుడా డైరెక్టర్లు నేత రవివర్మ, ఆంజనేయులు, స్మార్ట్‌సిటీ ఇంజనీర్‌ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T23:26:20+05:30 IST

Read more