విద్యుత్‌ షాక్‌తో మహిళ కూలీ మృతి

ABN , First Publish Date - 2022-04-10T05:37:32+05:30 IST

మండలంలోని కనుకులగిద్దె గ్రామంలో ఓ మహిళ కూలీ విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది.

విద్యుత్‌ షాక్‌తో మహిళ కూలీ మృతి
దూలం రాజేశ్వరి మృతదేహం

హుజూరాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 9: మండలంలోని కనుకులగిద్దె గ్రామంలో ఓ మహిళ కూలీ విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం కనుకులగిద్దె గ్రామానికి చెందిన దూలం రాజేశ్వరి (52) కూలీ పని కోసం అదే గ్రామానికి చెందిన రొంటాల మల్లారెడ్డి అనే వ్యవసాయ క్షేత్రంలో కలుపు తీసేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఆ వ్యవసాయ భూమిలోని బావి దగ్గర కరెంటు స్తంభం నుంచి కనుకులగిద్దె గ్రామపంచాయతీ మంచినీటి బావికి వెళ్లే కరెంటు సర్వీసు వైరు పొలంలో నుంచి కర్ర సహయంతో ఉండగా అది కిందపడిపోయింది. ఇది గమనించని రాజేశ్వరి కలుపు తీస్తూ ముందుకు వెళ్తూ ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలపై కాలు వేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త సాయిలు, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ మేరకు మృతిరాలి పెద్ద కుమారుడు దూలం తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.

Read more