నష్టపోయిన కుటుంబాలను ఆదుకుంటాం

ABN , First Publish Date - 2022-07-18T05:58:57+05:30 IST

గోదావరి వరదల్లో నష్ట పోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని పెద్ద పల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌, ఎమ్మెల్యే చందర్‌ అన్నారు.

నష్టపోయిన కుటుంబాలను ఆదుకుంటాం
వరద బాధితులతో మాట్లాడుతున్న ఎంపీ వెంకటేష్‌

- ఇళ్లు కోల్పోయిన వారికి రూ.3లక్షల ప్యాకేజీ 

- ఎంపీ వెంకటేష్‌నేత, ఎమ్మెల్యే చందర్‌

గోదావరిఖని, జూలై 17: గోదావరి వరదల్లో నష్ట పోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని పెద్ద పల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌, ఎమ్మెల్యే చందర్‌ అన్నారు. ఆదివారం రామగుండం నగరపాలక సం స్థ పరిధిలోని సప్తగిరికాలనీలో ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలను వారు పరిశీలించారు. కేసీఆర్‌ పాలనలో ఏ ఒక్క కుటుంబం, ఏ ఒక్క రైతు నష్ట పోయేది లేదని ఆయన తెలిపారు. బాధితులకు అన్ని విధానాలుగా న్యాయం జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సంద ర్భంగా సప్తగిరికాలనీలో ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం సొంత ఇంటి పథకం రూ.3లక్షలు వర్తిం చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వర ద బాధితులకు త్వరితగతిన అందించేందుకు ము ఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని వారు పేర్కొ న్నారు. కేసీఆర్‌ ముందస్తు ప్రణాళికతో ప్రాణనష్టం జరుగలేదని, ప్రజాప్రతినిధులు, అధికారులను ఎప్ప టికప్పుడు అప్రమత్తం చేశారన్నారు. వరద కారణం గా కాలనీల్లో అపరిశుభ్రమైన వాతావరణం నెలకొల కొన్నదని, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలని వారు బాధితులకు సూచించారు. వరద తాకిడితో లోతట్టు ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించిందని, ప్రతి ఇంటికి చెందిన ఆస్తి వివ రాలను త్వరితగతిన నమోదు చేసి నివేదికను అందజేయాలని చందర్‌ ఆదేశించారు. ఇక్కడి పరిస్థితులను కలెక్టర్‌కు ఫోన్‌లో వివరించారు. వీరి వెంట మేయర్‌ అనీల్‌ కుమార్‌, కార్పొరేటర్లు బాల రాజ్‌కుమార్‌, పులేందర్‌, దాతు శ్రీనివాస్‌, నాయ కులు జేవీ రాజు, కల్వల సంజీవ్‌, తోడేటి శంకర్‌ గౌడ్‌, మారుతి, అచ్చెవేణు, మండ రమేష్‌, చెలుకలపెల్లి శ్రీనివాస్‌, విజయ్‌, రాజేందర్‌, అక్షర మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

జనగామ రహదారిని పునరుద్ధరిస్తాం..

జనగామ గ్రామంలో దెబ్బతిన్న గోదావరి రహ దారిని వెంటనే పునరుద్ధరిస్తామని ఎంపీ, ఎమ్మెల్యే హామి ఇచ్చారు. వరద కారణంగా జనగామలో కూలిన వంతెనను పరిశీలించారు. తాత్కాలిక రహ దారిని ఏర్పాటు చేయాలని జీఎం నారాయణకు సూచించారు. ఈ సందర్భంగా ప్రజలు తాము ఎదుర్కొన్న సమస్యలను వివరించారు. వీరి వెంట కార్పొరేటర్‌ కవితసరోజిని, మాజీ కార్పొరేటర్‌ జనగామ నర్సయ్య, తోకల రమేష్‌, వామన్‌రావు, సంతోష్‌రావు, అడబత్తుల శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-07-18T05:58:57+05:30 IST