మార్కెట్‌ స్థలాన్ని కాపాడుకుంటాం

ABN , First Publish Date - 2022-11-25T00:14:48+05:30 IST

వ్యవసాయ మార్కెట్‌ ఏర్పాటుకు ప్రభుత్వ స్థలం అందుబాటులో లేక రైతాంగం సమష్టిగా 5ఎకరాల స్థలం సమకూ ర్చి వ్యవసాయ మార్కెట్‌కు అప్పగిస్తే ఇతర అవసరాల కోసం మళ్లించ డం ఏంటని ప్రాణాలర్పించైనా మార్కెట్‌యార్డు స్థలాన్ని కాపాడుకుంటా మని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

మార్కెట్‌ స్థలాన్ని కాపాడుకుంటాం
వినతిపత్రం ఇస్తున్న జీవన్‌రెడ్డి

ధరణి సమస్యలు పరిష్కరించాలి

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

రాయికల్‌, నవంబరు 24: వ్యవసాయ మార్కెట్‌ ఏర్పాటుకు ప్రభుత్వ స్థలం అందుబాటులో లేక రైతాంగం సమష్టిగా 5ఎకరాల స్థలం సమకూ ర్చి వ్యవసాయ మార్కెట్‌కు అప్పగిస్తే ఇతర అవసరాల కోసం మళ్లించ డం ఏంటని ప్రాణాలర్పించైనా మార్కెట్‌యార్డు స్థలాన్ని కాపాడుకుంటా మని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌కమిటీ స్థలాన్ని, కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి సమస్యలు అడి గి తెలుసుకున్నారు. ప్రదేశ్‌కాంగ్రెస్‌ కమిటీ పిలుపు మేరకుమండలం లోని పలు సమస్యలు పరిష్కరించాలని పట్టణ ప్రధాన రహదారుల మీ దుగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ అనీల్‌కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భం గా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండని సమీకృత మార్కెట్‌ను రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేయడాన్ని అధికారులు విరమించుకోవాలని అన్నా రు. మార్కెట్‌ యార్డు స్థలం 5ఎకరాలు కాగా గోదాములు, కార్యాలయా లకు రెండు ఎకరాలు పోగా ఒక ఎకరంలో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేసి మిగిలిన రెండు ఎకరాల్లో సమీకృత మార్కెట్‌ ఏర్పాటుకు కేటాయిస్తే రైతులు ధాన్యం ఎక్కడ ఆరబోస్తారని ప్రశ్నించారు. మున్సిపాలిటీ నిధుల నుంచిసమీకృత మార్కెట్‌ కోసం స్థలం కొనుగోలు చేయాల్సింది పోయి రై తులకు ఉపయోగపడే మార్కెట్‌యార్డు స్థలాన్ని ఎలా కేటాయిస్తారని వా పోయారు. వరి ధాన్యం క్వింటాలుకు 5కిలోల అదనపు తూకం వేయడం తో రైతులు నష్టపోతున్నారన్నారు. రుణమాఫీకి సంబంధించి తక్షణమే ప్ర భుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ధరణిలో నెలకొన్న సమస్యలు పరి ష్కరించేందుకు గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి శాశ్వ త పరిష్కారం దిశగా సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు గోపిరాజరెడ్డి, రవీంధర్‌రావు, మహేంధర్‌గౌడ్‌, కొయ్యడి మహి పాల్‌, మ్యాకల రమేష్‌, అత్తిణేణి గంగరెడ్డి, తంగెళ్ల రమేష్‌, కోసరి మహే ష్‌, గంగరెడ్డి, అంజన్న, ఆదిరెడ్డి, భూమయ్య, నర్శింహరెడ్డి, రవీంధర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:14:48+05:30 IST

Read more