-
-
Home » Telangana » Karimnagar » We will do justice to all deserving residents-NGTS-Telangana
-
అర్హులైన నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం
ABN , First Publish Date - 2022-09-10T06:39:00+05:30 IST
అర్హులైన మిడ్‌మానేరు నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హామీ ఇచ్చారు.

- అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్
తంగళ్లపల్లి, సెప్టంబర్ 9: అర్హులైన మిడ్‌మానేరు నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హామీ ఇచ్చారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతల్‌ఠాణా గ్రామాల్లో మిడ్ మానేరులో ముంపునకు గురై పరిహారం రాకుండా మిగిలిఉన్న కుటుంబాలు, పలు సమస్యలతో పరిహారం రాని వారితో శుక్రవారం సమావేశం నిర్వహించి దరఖాస్తులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వివిధ కారణాలతో పరిహారం రాని వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వాటిని పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. అర్హులైన వారందరికీ న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ సదానందం, సర్పంచ్‌లు జక్కుల రవీందర్, ఈసరి ఉమరాజు, జక్కుల నాగరాజ్, నలువాల జలేందర్, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.