-
-
Home » Telangana » Karimnagar » We condemn the attitude of TRS leaders-NGTS-Telangana
-
టీఆర్‌ఎస్ నేతల వైఖరిని ఖండిస్తున్నాం
ABN , First Publish Date - 2022-09-10T06:54:05+05:30 IST
హైదరాబాద్ పాతబస్తీలోని ఎంజెఎం మార్కెట్ వినాయక మండపం వద్ద జరిగిన పూజలకు ముఖ్య అతిథిగా హాజరైన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పట్ల టీఆర్‌ఎస్ నేతల వైఖరిని ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు.

ఒకటవ నెంబర్ వినాయకునికి మంత్రి గంగుల, ఎంపీ సంజయ్ పూజలు
కరీంనగర్ కల్చరల్, సెప్టెంబరు 9: హైదరాబాద్ పాతబస్తీలోని ఎంజెఎం మార్కెట్ వినాయక మండపం వద్ద జరిగిన పూజలకు ముఖ్య అతిథిగా హాజరైన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పట్ల టీఆర్‌ఎస్ నేతల వైఖరిని ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం టవర్ సర్కిల్ వద్ద జరిగిన నిమజ్జనోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ పాతబజార్ ఒకటవ నెంబర్ వినాయకునికి మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ కుమార్‌లు కొబ్బరికాయలు కొట్టి నిమజ్జన వేడుకలను ప్రారంభించారు. ఇద్దరు నేతలు ఒకేచోట పూజలు చేయడంతో అక్కడికి వచ్చిన భక్తులు ఆసక్తిగా తిలకించారు. మంత్రి వెళ్లిన అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుట్రలను హిందువులు తిప్పి కొడుతున్నారని అన్నారు.