కాళోజీ అడుగుజాడల్లో నడవాలి

ABN , First Publish Date - 2022-09-10T06:46:40+05:30 IST

రచనల ద్వారా ప్రజలను చైతన్య వంతం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప కవి కాళోజీ నారాయణ రావు అని, యువత ఆయన ఆడుగుజాడల్లో నడవాలని కలె క్టర్‌ జి. రవి అన్నారు.

కాళోజీ అడుగుజాడల్లో నడవాలి
నివాళులు అర్పిస్తున్న జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు

కలెక్టర్‌ రవి

నివాళులు అర్పించిన జడ్పీ, బల్దియా చైర్‌పర్సన్లు

జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 9: రచనల ద్వారా ప్రజలను చైతన్య వంతం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప కవి కాళోజీ నారాయణ రావు అని, యువత ఆయన ఆడుగుజాడల్లో నడవాలని కలె క్టర్‌ జి. రవి అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం కాళోజీ నారాయణ రావు 109వ, జయంతి, తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హాజరై కాళోజీ చిత్ర పటానికి పూల మా లలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ సమాజంలో పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ ప్ర జలకు ప్రశ్నించడం నేర్పి సమ, సమాజ నిర్మాణానికి బాటలు వేసిన గొ ప్ప వ్యక్తి కాళోజీ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బీఎస్‌ అత, అరుణశ్రీ ఉన్నారు. అలాగే జడ్పీ కార్యాలయంలో కాళోజీ చిత్ర ప టానికి జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్‌, కథలాపూర్‌ జ డ్పీటీసీలు మనోహర్‌రెడ్డి, నాగం భూమయ్య, జడ్పీ సీఈవో రామానుజ చార్యులు తదితరులు ఉన్నారు. అలాగే బల్దియా కార్యాలయంలో కాళోజీ చిత్ర ప టానికి చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి పూల మాలలు వేసి నివాళులు అర్పిం చి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీఈ రాజేశ్వర్‌, ఏవో శ్రీనివాస్‌ ఉ న్నారు. అలాగే జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంతో పాటు పొలాస వ్యవసాయ కళాశాల, పరిశోధనా స్థానం, పాలిటెక్నిక్‌ కళాశాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జయంతి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Read more