ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలి

ABN , First Publish Date - 2022-09-20T05:25:15+05:30 IST

సీనియర్‌ నాయకునిగా, సుధీర్ఘకా లం ప్రజాప్రతినిధిగా పనిచేసిన జీవన్‌రెడ్డి లాంటి నేతలు ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ముదుగంటి రవీంధర్‌రెడ్డి అన్నారు.

ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న రవీందర్‌రెడ్డి

బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ముదుగంటి రవీందర్‌రెడ్డి 

జగిత్యాల అర్బన్‌, సెప్టెంబరు 19 : సీనియర్‌ నాయకునిగా, సుధీర్ఘకా లం ప్రజాప్రతినిధిగా పనిచేసిన జీవన్‌రెడ్డి లాంటి నేతలు ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ముదుగంటి రవీంధర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన వి లేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 20ఏండ్లుగా జగిత్యాలలో ఉగ్రమూకల మూలాలు ఉన్నా, పోలీసుల పనితీరు సరిగా లేదన్నారు. జ గిత్యాలలోని కొన్ని ప్రాంతాలకు అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు ప ర్యటనలకు వెళ్లే స్వేచ్చ ఉన్నా బీజేపీ నేతలు వెళ్లే అవకాశం లేకపోవడం దురదృష్టకరం అన్నారు. గడిచిన 22ఏళ్ల క్రితం అజాంఘోరి అనే ఉగ్రవా ది ఎన్‌కౌంటర్‌తో జగిత్యాల ప్రాంతంలో ఉగ్రమూలాలు వెలుగు చూశా యన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు జగిత్యాల జిల్లాలో ఉగ్రమూకల అడుగుజాడలను పసిగట్టడంలో జిల్లా పోలీసులు విఫలమయ్యారన్నారు. ఉద్యమాల గడ్డగా పేరున్న జగిత్యాల ఉగ్రమూకలకు అడ్డాగా మారే దుస్థితి నెలకొందన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో దేశం అంతా హ ర్షాతిరేకాలు వ్యక్తం అయితే, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌ అధికా రంలోకి వస్తే తిరిగి ఆర్టికల్‌ 370ను పునరుద్ధరిస్తామని పేర్కొనడం ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనంగా భావించక తప్పదన్నారు. ఇప్పటికైనా పోలీసులు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని ఆయన హితవు పలి కారు. ఈ సమావేశంలో  బీజేపీ నాయకులు ఏసీఎస్‌ రాజు, బడే శంకర్‌, కిషోర్‌ సింగ్‌, గంగారాం, లక్ష్మారెడ్డి, భిక్షపతి,  జైనపురం రమేష్‌, తిరుపతి, ప్రమోద్‌, దుబ్బరాజం, సతీష్‌, సంతోష్‌, ప్రభులింగం, సాయి, శ్రవణ్‌, అనిల్‌ తదితరులున్నారు.


Updated Date - 2022-09-20T05:25:15+05:30 IST