రోడ్డు ఆక్రమించారని ముళ్ల కంచె వేసి గ్రామస్థుల నిరసన

ABN , First Publish Date - 2022-12-13T00:44:34+05:30 IST

గ్రామస్థులకు సౌలభ్యంగా ఉండే రోడ్డు ఆక్రమణకు గురైందని సోమారంపేట గ్రామస్థులు నిరసన చేపట్టారు. సిద్దిపేటకు వెళ్లే ప్రధాన రోడ్డును మాజీ ఎంపీపీ వడ్డె శ్రీనివాస్‌రెడ్డి తన స్వంత భూమి అని ఆక్రమించుకున్నాడని ఆదివారం గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.

రోడ్డు ఆక్రమించారని ముళ్ల కంచె వేసి గ్రామస్థుల నిరసన
సోమారంపేట ప్రధాన దారిపై వేసిన ముళ్ల కంచె

ఇల్లంతకుంట, డిసెంబరు 12: గ్రామస్థులకు సౌలభ్యంగా ఉండే రోడ్డు ఆక్రమణకు గురైందని సోమారంపేట గ్రామస్థులు నిరసన చేపట్టారు. సిద్దిపేటకు వెళ్లే ప్రధాన రోడ్డును మాజీ ఎంపీపీ వడ్డె శ్రీనివాస్‌రెడ్డి తన స్వంత భూమి అని ఆక్రమించుకున్నాడని ఆదివారం గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. దీనితో రెవెన్యూ అధికారులు సోమవారం గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. సర్వే జరుపుతామని పేర్కొన్నా గ్రామస్థులు శాంతించలేదు. సోమవారం గ్రామస్థులు నలువైపులా రోడ్లపై ముళ్లకంచెలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ గతంలో ఇదే రోడ్డును ఉపాధిహామీ పథకం కింద బాగుచేసుకున్నామన్నారు. రోడ్డు తొలగించడం వల్ల సిద్దిపేటకు వెళ్లడానికి ఇబ్బంది అవుతుందన్నారు. దీనిపై మాజీ ఎంపీపీ వడ్డె శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా నక్షప్రకారం ఉన్న రోడ్డును గతంలో తొలగించారని, ప్రస్తుతం ఉన్న రోడ్డు తన పట్టా భూమి లో ఉన్నందువల్లనే తొలగించానని పేర్కొన్నారు. అధికారులు సర్వే చేసి నక్షప్రకారం తన భూమిలో రోడ్డు వస్తే స్వంత డబ్బులతో రోడ్డు వేయిస్తానన్నారు.

Updated Date - 2022-12-13T00:44:37+05:30 IST