ఒకరికొకరు..(ఉపాధి) హామీ..

ABN , First Publish Date - 2022-06-12T06:07:52+05:30 IST

చేయి చేయి కలిస్తే సాధ్యం కానిది ఉండదంటారు..

ఒకరికొకరు..(ఉపాధి) హామీ..

     కోరుట్ల రూరల్‌, జూన్‌ 11: చేయి చేయి కలిస్తే సాధ్యం కానిది ఉండదంటారు.. కష్టాన్ని పంచుకుంటే ఆ బాధే తెలియదంటారు.. అలా ఉపాధిహామీ కూలీలు ఒకరికొకరు హామీగా నిలుస్తూ తమ కష్టాన్ని పంచుకున్నారు. ఓవైపు మండే ఎండ.. మరోవైపు భారంగా మారిన పనిని కలిసికట్టుగా చేసి ఆకర్షించారు. కోరుట్ల మండల గుంలాపూర్‌ గ్రామ ఉపాధిహామీ కూలీలు  శనివారం స్థానికంగా ఉన్న కాకతీయ కాలువ పూడికతీత పనులను చేశారు. కెనాల్‌లో పేరుకుపోయిన మట్టిని పైకి  తీసుకెళ్లేందుకు ఉపాధి కూలీలు వరుసగా నిలబడి మట్టిని తోడేశారు. కలిసి కట్టుగా పని చేస్తే సాధ్యం కానిది లేదని నిరూపించారు.         

                      

Read more