అట్టహాసంగా ముగిసిన జోనల్‌ స్థాయి క్రీడలు

ABN , First Publish Date - 2022-09-28T06:19:11+05:30 IST

మూడు రోజులు కొనసాగిన జోనల్‌ స్థాయి గురుకులాల క్రీడలు మంగళవారం అట్టహాసంగా ముగిశాయి. తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి గురుకుల పాఠశాలలో మెదక్‌, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన 13 గురుకుల పాఠశాలలకు చెందిన 1105 మంది విద్యార్ధులు క్రీడల్లో పాల్గొన్నారు.

అట్టహాసంగా ముగిసిన  జోనల్‌ స్థాయి క్రీడలు
విజేతలకు ట్రోఫీ అందజేస్తున్న ప్రజాప్రతినిధులు

తంగళ్లపల్లి, సెప్టంబరు 27: మూడు రోజులు కొనసాగిన జోనల్‌ స్థాయి గురుకులాల క్రీడలు మంగళవారం అట్టహాసంగా ముగిశాయి. తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి గురుకుల పాఠశాలలో మెదక్‌, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన 13 గురుకుల పాఠశాలలకు చెందిన 1105 మంది విద్యార్ధులు క్రీడల్లో పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా విద్యార్ధుల ఆటాపాటలతో సందడి నెలకొంది. విద్యార్ధులతోపాటు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు బతుకమ్మ ఆడారు. ఎంపీపీ పడిగెల మానస రాజు, ఎంపీటీసీ సిలివేరి ప్రసూన నర్సయ్య, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ  స్పోర్ట్స్‌ అధికారి డాక్టర్‌ రాంలక్ష్మణ్‌,  ఎంపీడీవో లచ్చాలు,  పీడీలు హరిరాం, సుష్మ, డీసీవో జాక్వెలిన్‌, ప్రిన్సిపాల్‌ పద్మ, ప్యాక్స్‌ చైర్మన్‌ బండి దేవదాస్‌, నాయకులు గజభీంకర్‌ రాజన్న, పడిగెల రాజు, సిలివేరి నర్సయ్య, మూడు జిల్లాల గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాల్‌లు  తదితరులు పాల్గొన్నారు.

ఛాంపియన్‌గా చింతకుంట గురుకులం 

మూడు రోజులపాటు కొనసాగిన జోనల్‌ స్థాయి క్రీడా పోటీల్లో  కరీంనగర్‌ జిల్లా చింతకుంట గురుకుల పాఠశాల ఛాంపియన్‌గా నిలిచింది. అండర్‌ 14 ఆధ్లెటిక్స్‌ విభాగంలో టీమ్‌ చాంపియన్‌ షిప్‌గా 26 పాయింట్లతో మెదక్‌ గురుకుల పాఠశాల, అండర్‌ 14 గేమ్స్‌ విభాగంలో టీమ్‌ చాంపియన్‌గా 35 పాయింట్లతో రామయంపేట్‌ గురుకుల పాఠశాల, అండర్‌ 17 ఆఽథ్లెటిక్స్‌ విభాగంలో 26 పాయింట్లతో చిన్నబోనాల గురుకుల పాఠశాల, అండర్‌ 17 గేమ్స్‌ విభాగంలో 30 పాయింట్లతో చింతకుంట, అండర్‌ 19 అథ్లెటిక్స్‌ విభాగంలో 43 పాయింట్లతో చింతకుంట, అండర్‌ 19 గేమ్స్‌ విభాగంలో 40 పాయింట్లతో చింతకుంట గురుకుల పాఠశాల నిలిచింది. మూడు విభాగాల్లో ఆత్యధిక పాయింట్లు సాధించి విజేతగా నిలవడంతో జోనల్‌ స్థాయి చాంపియన్‌గా చింతకుంట గురుకుల పాఠశాలకు ట్రోఫీ అందజేశారు. 

Read more