పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-09-30T05:37:12+05:30 IST

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం
ఇబ్రహీంపట్నంలో చీరలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు

- కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు 

ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 29: పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు.  ఈ సందరంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ పేదప్రజల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. స్వరాష్ట్రంలో మహిళలకు బీడీ పింఛను, బతుకమ్మ చీరలు, కేసీఆర్‌ కిట్‌ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి అడబిడ్డలకు అండగా ఉంటున్నారన్నారు. కార్యక్ర మంలో ఎంపీపీ జాజాల భీమేశ్వరి, ఎంపీడీఓ కట్కం ప్రభు,డిప్యూటీ తహశీల్దార్‌ పద్మ, సర్పంచ్‌ నేమూరి లత-సత్యనారయణ, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.

మల్లాపూర్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల అవసరాలు తెలుసుకుని తీర్చుతున్నారని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అన్నారు. ఆయన గురువారం మల్లాపూర్‌ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సరోజన-ఆదిరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏలాంటి సమస్యలున్నా తన దృష్టికి తేవాలని ప్రజాప్రతినిధులకు తెలిపారు. జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, పలువురు అధికారులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, సింగిల్‌ విండో చైర్మన్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-30T05:37:12+05:30 IST