విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే

ABN , First Publish Date - 2022-12-10T00:33:35+05:30 IST

విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని, రాష్ట్రం ఏర్పడితే విద్యారంగ, నిరుద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించిన తెలంగాణ విద్యార్థులు, యువకులకు సీఎం కేసీఆర్‌ నియంతృత్వ వైఖరితో నిరాశే మిగిలిందని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యజ్ఞవాల్క శుక్లా అ న్నారు.

విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే
అమరులకు నివాళులు అర్పిస్తున్న శుక్లా తదితరులు

ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యజ్ఞవాల్క శుక్లా

అట్టహాసంగా ప్రారంభమైన ఏబీవీపీ 41వ రాష్ట్ర మహాసభలు

జగిత్యాల అర్బన్‌, డిసెంబరు 9: విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని, రాష్ట్రం ఏర్పడితే విద్యారంగ, నిరుద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించిన తెలంగాణ విద్యార్థులు, యువకులకు సీఎం కేసీఆర్‌ నియంతృత్వ వైఖరితో నిరాశే మిగిలిందని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యజ్ఞవాల్క శుక్లా అ న్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక గీతా విద్యాలయం మైదానంలో శు క్రవారం ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యా యి. మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా తొలి రోజు కార్యక్రమాని కి ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యజ్ఞవాల్క శుక్లా, పద్మ భూష ణ్‌ అవార్డు గ్రహీత శ్రీయంలు హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్ర మాన్ని ప్రారంభించారు. అంతకు ముందు ఏబీవీపీ జెండాను ఆవిష్క రించడంతో పాటు, ఉద్యమంలో అమరులైన వారి త్యాగాలను స్మరించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శుక్లా మాట్లాడుతూ తెలం గాణలో విద్యారంగ సమస్యల పరిష్కారం, ఉద్యోగ నియామకాలు, జా తీయ విద్యావిధానం అమలుపై రాష్ట్ర మహాసభల్లో ఉద్యమ కార్యాచర ణను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. భారత దేశాన్ని శక్తివంతం గా నిల పడంతో పాటు, ప్రపంచానికే విశ్వగురువుగా తీర్చిదిద్దడంలో విద్యా ర్ధి పరిషత్‌ కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలన్నారు. తెలంగాణ ప్రాం తంలో తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం సాధిస్తామనే భ్రమలో విద్యా ర్థులు, యువకుల జీవితాలను నాశనం చేసిన నక్సలైట్లను ఈ గడ్డ నుంచి తరమివేసిన చరిత్ర తెలంగాణ యువతదన్నారు. జాతీయవాద సిద్ధాంతం కోసం రామన్న, గోపన్న, జితేంధర్‌రెడ్డి, మధుసూధన్‌ లాంటి అమరులయ్యారని, జగిత్యాల ప్రాంతం ఏబీవీపీకి ఒక పవిత్ర తీర్ధస్థలం లాంటిదన్నారు. ఇలాంటి ప్రాంతంలో ఏబీవీపీ సభలను నిర్వహించడం గర్వకారణం అన్నారు. 50లక్షల సభ్యత్వంతో అన్ని యూనివర్సిటీల్లో కా ర్యకలాపాలు నిర్వహిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏబీవీపీ కార్యక్షేత్రంలో ముందుకు సాగుతుందన్నారు. సంఘ ఉద్యమా ల ఫలితంగా విద్యా, సామాజిక రంగాల్లో అనేక మార్పులు వచ్చా య ని గుర్తు చేశారు. పద్మభూషన్‌ అవార్డు గ్రహీత శ్రీయం మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సంస్కారాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ మహా సభల్లో ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ శంకర్‌, రాష్ట్ర కా ర్యదర్శి ఝాన్సీ, స్వాగత సమితి అధ్యక్షుడు వాసం శివప్రసాద్‌, కార్య దర్శి మ్యాన మహేష్‌, సౌమ్యతో పాటు, రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 1100 మంది విద్యార్ధి నాయకులు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:33:37+05:30 IST