-
-
Home » Telangana » Karimnagar » The role of teachers in the development of society is crucial-NGTS-Telangana
-
సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయులు పాత్ర కీలకం
ABN , First Publish Date - 2022-09-08T05:47:36+05:30 IST
విజ్జానాన్ని పంచుతూ సమాజాభివృద్ధిలో ఉపాధ్యా యులు కీలక పాత్ర పోషిస్తున్నారని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు.

- జిల్లా విద్యాధికారి మాధవి
సుల్తానాబాద్, సెప్టెంబరు 7 : విజ్జానాన్ని పంచుతూ సమాజాభివృద్ధిలో ఉపాధ్యా యులు కీలక పాత్ర పోషిస్తున్నారని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. సుల్తానా బాద్ పట్టణంలోని విజ్ఞాన్ హైస్కూల్ ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన కార్య క్రమంలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియోషన్(ట్రస్మా) ఆధ్వ ర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఈవో మాధవి సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గురించి వివరించారు. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు ఉత్తమ, నాణ్యమైన విద్యనందిస్తున్న ప్రైవేట్ టీచర్ల సేవలను కొనియాడారు. నాయకులు సోగాల కొమురయ్య, కరీంనగర్, పెద్దపల్లి జి ల్లాల అధ్యక్షులు కోరెం సంజీవరెడ్డి, కేశవరెడ్డి, కార్యదర్శి అబ్బు బుచ్చిరెడ్డి, కోశాధికారి పాశం ఓదెలు, ఉమామహేశ్వర్, రవీందర్, మాటేటి సంజీవ్ పాల్గొన్నారు.