క్వాలిటీ సర్కిల్‌ వ్యవస్థను విస్తృతం చేయాలి

ABN , First Publish Date - 2022-09-30T04:55:01+05:30 IST

క్వాలిటీ సర్కిల్‌ వ్యవస్థను విస్తృతం చేయాలని రామగుండం ఎన్టీపీసీ జీఎం(ఓఅండ్‌ఎం) ఎకె.దేశాయ్‌ అన్నారు.

క్వాలిటీ సర్కిల్‌ వ్యవస్థను విస్తృతం చేయాలి
సదస్సును ప్రారంభిస్తున్న జీఎం ఎ.కె.దేశాయ్‌

- ఎన్టీపీసీ జీఎం ఎ.కె.దేశాయ్‌

జ్యోతినగర్‌, సెప్టెంబరు 29 : క్వాలిటీ సర్కిల్‌ వ్యవస్థను విస్తృతం చేయాలని రామగుండం ఎన్టీపీసీ జీఎం(ఓఅండ్‌ఎం) ఎకె.దేశాయ్‌ అన్నారు. గురువారం ఈడీసీ మిలీనియం హాలులో నిర్వహించిన 5వ కాంట్రాక్టు ఏజెన్సీ కార్మికుల క్వాలిటీ సర్కిల్‌ సదస్సును జీఎం దేశాయ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వ్యక్తిగతంగా కాకుండా ఒక సమూహంగా ప్రాజెక్టులో పనిచేయడం వల్ల కార్మికుల కు అనేక కొత్త విషయాలుతెలుస్తాయని, ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకో వచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీపీసీలో కొనసాగుతున్న నాణ్యతా సంఘాల(క్వాలి టీ సర్కిల్‌) వ్యవస్థను మరింత విస్తృతం చేయాల్సిన అవసరముందన్నారు. కార్మికు లు ఎప్పటికప్పుడు తమ వృత్తిలో నైపుణ్యం పొంది మరింత సమర్థవంతంగా పని చేయాలని కోరారు. క్వాలిటీ సర్కిల్‌ కన్వెన్షన్‌లో ప్రాజెక్టులోని వివిధ విభాగాలకు చెందిన 72 ఏజెన్సీల నుంచి 12 నాణ్యతా సంఘాలు పాల్గొన్నాయి. తాము ఆయా విభాగాల్లో క్వాలిటీ సర్కిళ్లుగా చేస్తన్న పనులను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించాయి. అత్యుత్తమంగా ప్రజంటేషన్‌ ఇచ్చిన మెకానికల్‌ మెయింటనెన్స్‌ కు చెందిన పవర్‌ క్వాలిటీ సర్కిల్‌కు ప్రథమ స్థానం లభించింది. బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నాణ్యతా సంఘాల సదస్సులో జీఎం(టిఎస్‌) పుష్పేంద్రకు మార్‌ లాడ్‌, బి.ఇ, ఈఈఎంజీ ఏజీఎం మనోజ్‌ ఝా, డీజీఎం ఎం.శివప్రసాద్‌, అధి కారులు, ఉదోగులు, కాంట్రాక్టు ఏజెన్సీ కార్మికులు పాల్గొన్నారు.  

Read more