-
-
Home » Telangana » Karimnagar » The Minister congratulated the Municipal Chairperson and Commissioner-NGTS-Telangana
-
మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్‌ను అభినందించిన మంత్రి
ABN , First Publish Date - 2022-10-05T06:08:48+05:30 IST
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రక టించిన స్వచ్ఛతా లీగ్, స్వచ్ఛసర్వేక్షణ్ జాతీయ అవా ర్డులను అందుకున్న మున్సిపల్ కమిషనర్ అయాజ్, చైర్ పర్సన్ అన్నం లావణ్యను మంగళవారం రాష్ట్ర ము న్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అభి నందించారు.

కోరుట్ల, అక్టోబరు 4 : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రక టించిన స్వచ్ఛతా లీగ్, స్వచ్ఛసర్వేక్షణ్ జాతీయ అవా ర్డులను అందుకున్న మున్సిపల్ కమిషనర్ అయాజ్, చైర్ పర్సన్ అన్నం లావణ్యను మంగళవారం రాష్ట్ర ము న్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అభి నందించారు. హైదరాబాద్ కేంద్రంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన అభినం దన సభలో అవార్డులను మంత్రి కేటీఆర్‌తో కలిసి కమి షనర్, చైర్పర్సన్ పదర్శించగా మంత్రి వారిని అభినం దించారు. ఈ సందర్బంగా పట్టణ అభివృద్ధికి రూ. 4 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించినట్లు కమీషనర్, చైర్పర్సన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఫోన్లో విలేకర్లతో మాట్లాడారు. అవార్డు ఎంపికకు స హకారం అందించిన మంత్రి కేటీఆర్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావులతో పాటు జిల్లా అధికారులు, ము న్సిపల్ పాలక వర్గ సభ్యులకు కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కు మార్, మున్సిపల్ అడ్మినిస్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, జిల్లా అదనపు కలెక్టర్ అరుణలతో పాటు మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.