ప్రణాళికాబద్ధంగా ‘మన ఊరు మన బడి’ని అమలు చేయాలి

ABN , First Publish Date - 2022-03-04T06:21:49+05:30 IST

జిల్లాలో ప్రణాళికాబద్ధంగా మన ఊరు మన బడిని అమలు చేయాల్సిన అవసరముందని కలె క్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అన్నారు.

ప్రణాళికాబద్ధంగా ‘మన ఊరు మన బడి’ని అమలు చేయాలి
వెబ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ రవి

కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌

జగిత్యాల, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రణాళికాబద్ధంగా మన ఊరు మన బడిని అమలు చేయాల్సిన అవసరముందని  కలె క్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అన్నారు. గురువారం పట్టణంలోని కలె క్టరేట్‌ కార్యాలయం నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా సంబంధిత అధికా రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ రవి మాట్లాడా రు. ఈనెల 8వ తేదీన సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో లాంచనంగా మన ఊరు, మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారన్నారు. న్యాయ బద్దమైన ప్రతిపాదనలు అధికారులు తయారు చేయాలని, ప్రతీ మండలానికి ఒక ఇంజనీరింగ్‌ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని, మండల స్థాయి అవగాహన సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పూ ర్వ విద్యార్థుల పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. కొడిమ్యాల మండలంలోని మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ని ర్వహించకపోవడం పట్ల కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అ దనపు కలెక్టర్‌ బీఎస్‌ లత, పంచాయతీ రాజ్‌ ఈఈ రహ్మన్‌, మిష న్‌ భగీరథ ఈఈ శేఖర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

ఫజిల్లాలో ప్రాథమిక ఆరోగ్య సబ్‌ సెంటర్ల భవన నిర్మాణాలకు అవసరమైన స్థలాలను అధికారులు ఎంపిక చేయాలని కలెక్టర్‌ ఆ దేశించారు. గురువారం పట్టణంలోని కలెక్టరేట్‌ కార్యాలయం నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో 151 ఉప ఆరోగ్య కేం ద్రాలున్నాయన్నారు. వీటిలో ఇప్పటికే 25 సబ్‌ సెంటర్లకు సొంత భవనాలున్నాయన్నారు. 25 సబ్‌ సెంటర్లకు స్థలాల ఎంపిక చేసి ప్ర తిపాదనలు పంపాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య కేంద్రాల సబ్‌ సెంటర్ల సమీపంలో అందుబాటులో గల ప్రభుత్వ భూమిని గుర్తిం చాలని సూచించారు. ధర్మపురి, ఖమ్మంపల్లి, మల్యాల, కొత్తపేట, మ ల్లాపూర్‌, మదాపూర్‌ తదితర పలు సెంటర్లు మినహాయించి మిగి లిన సబ్‌ సెంటర్లకు భూముల కేటాయింపు పూర్తయిందన్నారు. ఆరో గ్య సబ్‌ సెంటర్‌కు కనీసం 300 గజాల భూమిని గుర్తిస్తున్నామ న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత, రెవె న్యూ డివిజన్‌ అధికారులు, డీఎంఅండ్‌హెచ్‌ఓ, మున్సిపల్‌ కమిష నర్లు, తహసీల్ధార్లు, ఎంపీడీఓలు, మండల పంచాయతీ అధికారులు, వైద్య అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-04T06:21:49+05:30 IST