జగిత్యాల పట్టణ అభివృద్ధే ప్రధాన ధ్యేయం

ABN , First Publish Date - 2022-05-24T06:05:03+05:30 IST

జగిత్యాల పట్టణ అభివృద్ధే తమ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు.

జగిత్యాల పట్టణ అభివృద్ధే ప్రధాన ధ్యేయం
అభివృధ్ది పనుల శిలఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే, చైర్‌ పర్సన్‌

ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌, మే 23 : జగిత్యాల పట్టణ అభివృద్ధే తమ ప్రధాన ధ్యేయమని  ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. పట్టణంలోని 1, 39, 40, 23, 24 వార్డుల్లో రూ. 1.30 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణితో కలిసి ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ శంకుస్థాపనలు చేశారు. అనంతరం సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన అనం తరం పట్టణాలకు అత్యధిక నిధులను కేటాయిస్తూ మౌలిక సదుపాయాలు కల్పిం చేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. జగిత్యాల పురాతన పట్టణమని గత నాయకుల నిర్లక్ష్యం వల్ల నేడు లేవట్లు లేక పట్టణం అస్తవ్యస్తంగా తయారైందని, ఇష్టా రీతిన నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అనుమతి ఉంటేనే ఇళ్ల నిర్మాణాలు చేపడుతు న్నారన్నారు. జగిత్యాల పట్టణంలోని నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మా ణంలో ఉన్నాయని, త్వరలోనే కేటాయిస్తామన్నారు. రూ. 2 కోట్ల నిధులతో నూత న లైబ్రరీ ఏర్పాటు చేసున్నామని, స్థలం కూడా కేటాయించామన్నారు. ఎస్సీ స్టడీ సర్కిల్‌ ద్వారా సంవత్సరానికి 200 మంది నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్‌ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అనీల్‌, శివ కేసరి బాబు, వాణి, జుంబర్తి రాజ్‌ కుమార్‌, రాము, కూతురు రాజేష్‌, రాము, లత, కమిషనర్‌ స్వరూప రాణి, డీఈ రాజేశ్వర్‌ ఉన్నారు.

ఎమ్మెల్యేను కలిసిన వడ్డెర సంఘం నాయకులు

జగిత్యాల జిల్లా కేంద్రంలో వడ్డెర కులస్థులకు శ్మశాన వాటికకు స్థలం కేటా యించాలని కోరుతూ సోమవారం రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడు వల్లెపు మొ గిలి, కౌన్సిలర్‌ రేణుకల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు ఒర్సు ఎల్లయ్య ఉన్నారు.

Updated Date - 2022-05-24T06:05:03+05:30 IST