సర్పంచ్‌ల హక్కులు కాలరాసేల ప్రభుత్వ వైఖరి

ABN , First Publish Date - 2022-12-30T00:47:57+05:30 IST

సర్పంచ్‌ల హక్కులు కాలరాసేల వ్యవ హ రిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తీరుపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు.

సర్పంచ్‌ల హక్కులు కాలరాసేల ప్రభుత్వ వైఖరి
మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

సారంగాపూర్‌, డిసెంబరు, 29: సర్పంచ్‌ల హక్కులు కాలరాసేల వ్యవ హ రిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తీరుపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. గు రువారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడతూ రాజీవ్‌ గాంధీ స్థానిక సంస్థల నిర్వహణకు, ఆర్థిక తోడ్పాడు అందించేందుకు జవహర్‌ రోజ్‌ గార్‌ యోజన, నెహ్రూ రోజ్‌గార్‌ యోజన పథకం ద్వారా కేంద్రం నుం చినేరుగా స్థానిక సంస్థలకు నిధులు వచ్చేవని అన్నారు. ఆనాడు యూపీఏ పాలనలో పేద, నిరుపేద ప్రజలకు ఉపాధి కల్పించాలని ఉపాధిహమీ పథకం ప్రవేశపెట్టామన్నారు. గ్రామాల్లో చేపట్టే ఏ అభివృద్ధి పథకం అయినా ఉపాధి హామీ పథకం నిధులతోనే చేపడతారని పేర్కొన్నారు. నిధుల విడుదలలో కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ఒకరిపై ఒరకు ఆరోపణలు చేసుకుకుంటూ స్థాని క సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పై అపనమ్మకంతో కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ప్రత్యేకంగా ఖాతాలు తెరి స్తే డిజిటల్‌ కీతో రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించి అపహాస్యం చే సిందని మండిపడ్డారు. నిధులు మళ్లించిన అధికారులపై చర్యలు చేపట్టాలని, దొడ్డిదారిన కాజేసిన నిధులను వెంటనే గ్రామ పంచాయితీలకు జమచేయాల ని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేవారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు కోండ్ర రాంచందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ నవీనఖరావు, సర్పంచ్‌ బొడ్డుపెల్లి రాజన్న, సీనియర్‌, రైతు నాయకులు కొక్కు గంగారాం, కాలగిరి సత్యనారాయణరెడ్డి, కర్నె అంజిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:47:57+05:30 IST

Read more