‘సద్దుల’ సంబరం

ABN , First Publish Date - 2022-10-04T06:36:32+05:30 IST

జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు వైభవంగా నిర్వహిం చారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన బతుక మ్మ సంబరాలు తొమ్మిదో రోజు సోమవారం సద్దుల బతుకమ్మతో ముగిశాయి.

‘సద్దుల’ సంబరం
ఉషన్నపల్లిలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

- ఆనందోత్సహాల మధ్య ఆడపడుచుల ఆటపాట

- ముగిసిన బతుకమ్మ వేడుకలు

పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబరు 3: జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు వైభవంగా నిర్వహిం చారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన బతుక మ్మ సంబరాలు తొమ్మిదో రోజు సోమవారం సద్దుల బతుకమ్మతో ముగిశాయి. ఆడబిడ్డలు తీరొక్క పూలతో  ఇంటిల్లిపాది కూర్చుని బతుకమ్మలు అందంగా పేర్చా రు. గౌరమ్మను బతుకమ్మపై ఉంచి సాయంకాలం పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ చెరువు, గుండం కట్ట చెరువు, జండా కూడలి, ప్రగతి నగర్‌, భూంనగర్‌, శాంతినగర్‌, హనుమాన్‌ నగర్‌, శివాల యం, మొదల గు ప్రాంతాల్లో ఆయా కాలనీవాసులు  బతుకమ్మను ఆడి అనంతరం వాయినాలు పంచు కున్నారు. ఎల్లమ్మ చెరువు కట్ట పై జరిగిన సంబరాల్లో ఎమ్మె ల్యే దాసరి మనోహర్‌రెడ్డి సతీ మణి పుష్పలత, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ మమతారెడ్డి పాల్గొన్నారు.  


Read more