-
-
Home » Telangana » Karimnagar » The CBI should investigate the incident of rape-NGTS-Telangana
-
అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి
ABN , First Publish Date - 2022-06-07T05:53:26+05:30 IST
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేవైయం జిల్లా అధ్యక్షుడు రెంటం జగదీష్ రా ష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బీజేవైయం జిల్లా అధ్యక్షుడు రెంటం జగదీష్
జగిత్యాల అర్బన్, జూన్ 6: జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేవైయం జిల్లా అధ్యక్షుడు రెంటం జగదీష్ రా ష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరు గుతున్న అత్యాచార దాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని స్థానిక మం చినీళ్ల బావి సమీపంలో బీజేవైయం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో ప్రజాప్రతినిధుల కుటుంబీకులు ఉండడం వల్లనే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసును సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైయం జిల్లా కార్యదర్శి చింత అనిల్, జిల్లా కార్యదర్శి గంగాధర్, కోశాధికారి గుర్రం రంజిత్, ఉపాధ్యక్షులు మెరుగు రమేష్, అధికార ప్రతినిధి కురమ రమేష్, తో పాటు ఆయా మండలాల అధ్యక్ష, కార్యదర్శులు,నాయకులు, కార్యకర్తలున్నారు.