అధికారుల నిర్లక్ష్య వైఖరి మారాలి

ABN , First Publish Date - 2022-11-16T00:13:46+05:30 IST

మిషన్‌ భగీరథ, విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై మంగళవారం నిర్వహించిన మండల పరషత్‌ సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు, రెండు గ్రామాల సర్పంచ్‌లు ధ్వజమెత్తారు.

అధికారుల నిర్లక్ష్య వైఖరి మారాలి

ఓదెల, నవంబరు 15 : మిషన్‌ భగీరథ, విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై మంగళవారం నిర్వహించిన మండల పరషత్‌ సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు, రెండు గ్రామాల సర్పంచ్‌లు ధ్వజమెత్తారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ రేణుకాదేవి అఽధ్యక్షతన నామమాత్రంగానే సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొలనూర్‌. ఓదెల, మడక, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు మ్యాడగోని భాగ్యమ్మ, గుండేటి మధులు మాట్లాడుతూ గ్రామాల్లో పాతకాలం నాటి స్థంభాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వీటిని తొలగించాలని, పలు సమావేశాల్లో చెప్పినప్పటికి విద్యుత్‌ అఽఽధికారులు పట్టించు కోవడం లేదన్నారు. అలాగే మంజూరైనా పెన్షన్‌లను బ్యాంకు అధికారులు ఇవ్వకుండా, అప్పు కింత, ఫ్రీజింగ్‌లో ఉంటున్నాయని సర్పంచ్‌ మధు తెలిపారు. ఎంపీటీసీ కారెంగుల శ్రీనివాస్‌ మాట్లా డుతూ రైతులకు ధాన్యం తూకం వేసిన వెంటనే ట్రక్‌ షీట్లు అంద జేయాలని, దీనిపై అధికారులకు తెలిపిన కూడా ఎందుకు పట్టించు కోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గ్రామాల సర్పంచ్‌ లు మినహా 20గ్రామాల సర్పంచ్‌లు సమావేశానికి గైర్హాజరై ఫలితం లేని సమావేశం పట్ల నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ పంచాయతీలకు సీఎం కేటాయించే రూ.10 లక్షల్లో ఎంపీటీసీలకు రూ.5లక్షల నిధులను కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానిం చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గంట రాములు, ఎంపీడీవో సత్త య్య, తహసీల్దార్‌ రమేష్‌, డీఈ సతీష్‌, వైద్యులు, ఏఈలు, ఎంపీటీ సీలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T00:13:49+05:30 IST