పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణది

ABN , First Publish Date - 2022-10-02T05:06:49+05:30 IST

పువ్వులను పూ జిం చే గొప్ప సంస్కృతి కలి గిన ప్రాంతం తెలంగాణ అ ని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేష్‌ అన్నారు.

పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణది

బతుకమ్మ వద్ద పూజ చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత

 ఆకట్టుకున్న బతుకమ్మ సంబరాలు 

జగిత్యాల అర్బన్‌, అక్టోబరు 1: పువ్వులను పూ జిం చే గొప్ప సంస్కృతి కలి గిన ప్రాంతం తెలంగాణ అ ని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలతో పాటు, నవ్య జూనియర్‌ కళాశాలలో బతుకమ్మ సం బరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతి థులుగా జడ్పీఛైర్‌పర్సన్‌ దావ వసంత, అడిషనల్‌ కలెక్టర్‌లు బీఎస్‌ లత, అరుణశ్రీలు హాజరై మాట్లా డుతూ తె లంగాణ సంస్కృతి, సాంప్ర దాయాలను భావి తరా లకు అందిస్తున్న నలంద, నవ్య కళాశాల యాజ మాన్యానికి, అందులో భాగస్వాములు అవుతున్న వి ద్యార్థులను అతిథులు అభినందించి, శుభా కాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ శ్రీపాద నరేష్‌, నవ్య జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ గాలిపెల్లి ఈశ్వర్‌, కౌన్సిలర్‌ జుంబర్తి రాజ్‌కుమార్‌, వి ద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. బతుకమ్మ సం బరాలతో సందడి వాతావరణం నెలకొంది.


Read more