వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-30T06:01:22+05:30 IST

ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవా లని ఎలెక్టెడ్‌ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్‌.రావు అన్నారు. మండలంలో ని నూకపెల్లిలో బీఎన్‌.రావు హెల్త్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బలానికి, రోగ నిరోధక శక్తి పెరగడానికి అందించే మందులను పంపిణీ చేశారు.

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
మందులను అందజేస్తున్న బీఎన్‌.రావు

ఫఎలెక్టెడ్‌ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్‌.రావు

మల్యాల, మే 29: ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవా లని ఎలెక్టెడ్‌ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్‌.రావు అన్నారు. మండలంలో ని నూకపెల్లిలో బీఎన్‌.రావు హెల్త్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బలానికి, రోగ నిరోధక శక్తి పెరగడానికి అందించే మందులను పంపిణీ చేశారు. ప్రతి ఒ క్కరూ రోగ నిరోధక శక్తి కలిగి ఉండడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉం టారని తెలిపారు. గ్రామంలోని దళిత కాలనీలో ఇంటింటికీ వీటిని అందిం చనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సరోజనగంగాధర్‌, స రస్వతి ఆలయ ఈవో అంగలి రాజం గ్రామస్తులు పాల్గొన్నారు

ఫమల్యాలలోని శ్రీవాగ్దేవి స్కూల్‌లో ఆర్‌వీఎం ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. ఈ శిభిరంలో వైద్యులు గణేశ్‌ వెర్మా, అఖిల, కళ్యాణ్‌తో పాటు మరో 30మంది వైద్యులు దాదాపు 1000 మందికి వైద్య పరీక్షలు చేశారు. గుండె, ఇతరాత్ర సమస్యలు గల వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు తెలిపారు. వైద్య శిభిరాన్ని మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ సందర్శించారు. శ్రీవాగ్దేవి స్కూల్‌ కరస్పాండెంట్‌ పో కల నరేశ్‌, బీజేపీ మండల అధ్యక్షుడు నేరెళ్ల శ్రావన్‌కుమార్‌, జనగాం రా ములు, రాచర్ల రమేశ్‌, మల్లేశం, ముదుగంటి రాజు, గుండేటి గంగారాం, రుత్త కిషన్‌, సాయితేజ ఆసుపత్రి అడ్మిన్‌ కుర్రె మధు, లక్ష్మణ్‌ ఉన్నారు


Read more