స్వచ్ఛ వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-09-08T05:48:46+05:30 IST

జిల్లావ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో స్వచ్ఛ వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహిం చాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ అన్నారు.

స్వచ్ఛ వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలి
గర్రెపల్లి ఎస్సీ గురుకులంలో తనిఖీ చేస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ 

- గర్రెపల్లి గురుకుల వసతి గృహం తనిఖీ

సుల్తానాబాద్‌, సెప్టెంబరు 7: జిల్లావ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో స్వచ్ఛ వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహిం చాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ అన్నారు. సుల్తా నాబాద్‌ మండలం గర్రెపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలను కలెక్టర్‌ బుధవారం తనిఖీ చేశారు. ఇంటర్మీయట్‌ ప్రఽథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థినులతో కలెక్టర్‌ మాట్లాడి వసతిగృహంలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. పారిశుధ్యం, తాగునీరు తదితర అంశాల గురించి ప్రస్తావించా రు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ గురుకుల కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, వసతిగృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, బాలికలకు అందించే ఆహారం నాణ్యతగా ఉండేలా చూడాలని, నిర్వాహకులు శ్రద్ధ చూపాలని, ఎప్పుడూ వేడివేడి ఆహారాన్ని అందించాలని సూచించారు. ఈ వస తి గృహంలో ఉన్న పడకగదులను నిత్యం శుభ్రం చేయాలని, నీటి ట్యాంకులను కూడా ఎప్పటికప్పుడు క్లీన్‌ చేసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట సర్పంచ్‌ వీరగోని సుజాత రమేష్‌, ఎంపీవో ఫయాజ్‌, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ అశోక్‌రెడ్డి, మాజీ సింగిల్‌విండో ఆధ్యక్షులు రమే ష్‌ గౌడ్‌, కార్యదర్శి ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more