-
-
Home » Telangana » Karimnagar » Suspend Ravinder Singh Kamaljit Kaur-NGTS-Telangana
-
రవీందర్‌సింగ్, కమల్‌జిత్‌కౌర్‌ను సస్పెండ్ చేయండి
ABN , First Publish Date - 2022-09-11T06:20:04+05:30 IST
పార్టీ వ్వతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కార్పొరేటర్లు రవీందర్‌సింగ్, కమల్‌జిత్‌కౌర్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు శనివారం రాత్రి వినతి పత్రం సమర్పించారు.

మానకొండూర్, సెపెంబరు 10: పార్టీ వ్వతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కార్పొరేటర్లు రవీందర్‌సింగ్, కమల్‌జిత్‌కౌర్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు శనివారం రాత్రి వినతి పత్రం సమర్పించారు. మానకొండూర్‌లోని జీవిఆర్ నివాసంలో కార్పోరేటర్లు, అర్భన్ బ్యాంకు డైరెక్టర్లు, టీఆర్‌ఎస్ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూమంత్రి గంగుల కమలాకర్‌పై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న రవీందర్‌సింగ్, కమల్‌జిత్‌కౌర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డిప్యూటి మేయర్ చల్లా స్వరూపరాణి, కార్పోరేటర్లు పాల్గొన్నారు.