పోటీతత్వంతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి

ABN , First Publish Date - 2022-09-10T06:24:07+05:30 IST

గురుకులంలోని ప్రతి బాలిక పోటీతత్వంతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

పోటీతత్వంతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

- మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 

ధర్మారం,సెప్టెంబరు9: గురుకులంలోని ప్రతి బాలిక పోటీతత్వంతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శుక్రవారం ధర్మారం మండలం మల్లాపూర్‌ బాలికల గురుకుల విద్యాల యంలో స్వచ్ఛ గురుకుల్‌ కార్యక్రమంలో భాగంగా ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడారు. గురుకులాల్లో పరిసరాలు పరిశుభ్రత-పచ్చదనంతో ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం స్వచ్ఛ గురుకుల్‌ వారోత్సవాలకు శ్రీకారం చుట్టిందని మంత్రి పేర్కొన్నా రు. క్రీడా, విద్యా రంగాల్లో బాలికలు రాణించాలన్నారు. అత్యుత్తమ ఫలి తాలు సాధించిన బాలికలకు మంత్రి ఈశ్వర్‌ బహుమతులు ప్రదానం చేశారు. విద్యాలయం ఆవరణలో సెంట్రల్‌ లైటింగ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ జాయంట్‌ కార్య దర్శి, కరీంనర్‌ ఇన్‌చార్జీ ఆర్‌సీవో అనంతలక్ష్మి, ప్రిన్సిపాల్‌ గిరిజ, జడ్పీటీసీ సభ్యురాలు పూస్కూరి పద్మజ, సర్పంచ్‌ గందం వరలక్ష్మి, ఎంపీటీసీ సరి త, మార్కెట్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఎంపీడీవో జయశీల, తహసీ ల్దార్‌ వెంకటలక్ష్మి, పత్తిపాక సింగిల్‌విండో చైర్మన్‌ నోముల వెంకట్‌రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్‌ సుంచు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-10T06:24:07+05:30 IST