విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరం

ABN , First Publish Date - 2022-09-25T06:16:18+05:30 IST

విద్యార్థులకు నాణ్యమైన చదువుతోపాటు క్రీడలు కూడా అవసరమని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు.

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరం
మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

- కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

- ఉమ్మడి జిల్లాస్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు ప్రారంభం

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, సెప్టెంబరు 24: విద్యార్థులకు నాణ్యమైన చదువుతోపాటు క్రీడలు కూడా అవసరమని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. జ్యోతిష్మతి ఇంజనీరింగ్‌ కళాశాల 25వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా స్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలను ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. జ్యోతిష్మతి కళాశాల చైర్మన్‌ జువ్వాడి సాగర్‌రావు మాట్లాడుతూ జ్యోతిష్మతి ఇంజనీరింగ్‌ కళాశాల 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా క్రీడా పోటీలు  నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండురోజులపాటు నిర్వహించనున్న ఈ పోటీల్లో  200 మంది క్రీడాకారులు  పాల్గొంటున్నారన్నారు. విజేతలకు 50 వేల రూపాయల నగదు బహుమతితోపాటు ట్రోఫీలు అందిస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌ అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌తో కలిసి షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఆడారు. కార్యక్రమంలో డీవైఎస్‌ కీర్తి రాజవీరు, బ్యాడ్మింటన్‌ సంఘం జిల్లా కార్యదర్శి వై ఉపేందర్‌రావు, కళాశాల ప్రిన్సిపాల్‌ కేఎస్‌ రావు, విశ్వప్రకాశ్‌బాబు, డాక్టర్‌ దావ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Read more