అధిక వడ్డీలతో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-12-31T23:33:16+05:30 IST

అధిక వడ్డీలతో వ్యాపారం చేస్తే కఠిన చ ర్యలు తప్పవని జగిత్యాల డీఎస్పీ ప్రకాష్‌ హెచ్చరించారు.

అధిక వడ్డీలతో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ ప్రకాష్‌

జగిత్యాల టౌన్‌, డిసెంబరు 31 :అధిక వడ్డీలతో వ్యాపారం చేస్తే కఠిన చ ర్యలు తప్పవని జగిత్యాల డీఎస్పీ ప్రకాష్‌ హెచ్చరించారు. శనివారం జగి త్యాల డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ప్రకాష్‌ విలేకరుల సమావేశం ని ర్వహించి మాట్లాడారు. జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా అధిక వడ్డీ లకు డబ్బులు ఇస్తున్న పలు వ్యాపారుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేసి నట్లు వివరించారు. దాడుల్లో రూ. 33,13,320 విలువ గల 545 ప్రామిసరి నోట్స్‌, 410 ఖాళీ చెక్కులు, 14 ఏటీఎం కార్డులు, రూ.6,07,130 నగదు, రెండు తులాల బంగారం, 100 వివధ వాహనాల ఆర్‌సీలు, పత్రాలు స్వాదీనం చే సుకుని, తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశామన్నారు. జగిత్యాల రూర ల్‌ సీఐ కృష్ణ కుమార్‌, ధర్మపురి సీఐ కోఠేశ్వర్‌ ఉన్నారు.

Updated Date - 2022-12-31T23:33:16+05:30 IST

Read more