మద్యం నిల్వలపై ప్రత్యేక నిఘా

ABN , First Publish Date - 2022-09-30T05:39:33+05:30 IST

అక్రమంగా నిల్వ ఉంచిన మద్యంపై ప్రత్యేక నిఘాపెట్టినట్లు జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు.

మద్యం నిల్వలపై ప్రత్యేక నిఘా
మద్యం బాటిళ్లు, నిందితులను చూపుతున్న ఎక్సైజ్‌ పోలీసులు

- ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీధర్‌

- జిల్లాలో డిఫెన్స్‌ మద్యం పట్టివేత, ఇద్దరి అరెస్టు  

జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 29: అక్రమంగా నిల్వ ఉంచిన మద్యంపై  ప్రత్యేక నిఘాపెట్టినట్లు జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు.   కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లితో పాటు జగిత్యాల పట్టణంలోని పురాణీపేటలో బుధవారం రాత్రి ఏకకాలంలో ఎక్సైజ్‌ పోలీసులు దాడులు నిర్వహించి డిఫెన్స్‌ మద్యం 86 బాటిళ్లతో పాటు తెలంగాణకు చెందిన 4 బాటిళ్లను పట్టుకుని సీజ్‌ చేశారు. గురువారం జగిత్యాల ఎక్సైజ్‌ కార్యాలయ ఆవరణలో సీజ్‌ చేసిన మద్యం బాటిళ్లతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చూపించి విలేకరుల సమావేశంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ వివరా లు వెల్లడించారు. కర్నాటక రాష్ట్రంలో మాత్రమే విక్రయించే డిఫెన్స్‌ మద్యం బాటిళ్లను కొంత మంది జగిత్యాలకు తీసుకవచ్చినట్లు సమాచారం వచ్చిందని పేర్కొన్నారు. కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లి గ్రామ శివారులో ఉన్న అమృత ఆగ్రో ఇండస్ట్రీస్‌, జగిత్యాల పట్టణంలోని పురాణీపేటలో ఉన్న వినా యక ట్రేడర్స్‌లో దాడులు చేసినట్లు వివరించారు. కర్నాటక డిఫెన్స్‌కు సంబం ధించి 86 మద్యం బాటిళ్లతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నాలు గు బాటిళ్లు పట్టుకుని సీజ్‌చేసినట్లు వివరించారు. ఈ నేరానికి పాల్పడ్డ ముక్క గంగాధర్‌తో పాటు జిల్లా ప్రభాకర్‌లను అరెస్టు చేసి వీరిపై 34 ఏ సెక్షన్‌, తెలంగాణ ఎక్సైజ్‌ ఆక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేసినట్లు వివరించారు.  అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రభానునాయక్‌, సీఐలు ప్రభాకర్‌ రెడ్డి, నరేష్‌రెడ్డి, భాస్కర్‌రావ్‌, అశోక్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-09-30T05:39:33+05:30 IST