రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-14T05:26:24+05:30 IST

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ఎస్పీ సింధూ శర్మ అ న్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రశంస పత్రం అందిస్తున్న ఎస్పీ

- ఎస్పీ సింధూ శర్మ

జగిత్యాల, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ఎస్పీ సింధూ శర్మ అ న్నారు. మంగళవారం పట్టణంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో నేర సమీక్షను నిర్వహించారు. ఈసందర్బంగా ఎస్పీ సింధూ శర్మ మాట్లాడా రు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అవసరమైన ప్రాంతాల్లో భారీ కేడ్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రతీ నిత్యం డ్రంక్‌ డ్రైవ్‌ చేయాలన్నారు. పట్టుబడిన వ్యక్తుల డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకొ ని లైసెన్స్‌ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారుసు చే యాలన్నారు. పెండింగ్‌ కేసులపై పోలీసు అధికారులు తీసుకున్న ప్రత్యేక చొరవతో పురోగతి సాధించారన్నారు. పెండింగ్‌ కేసుల సంఖ్య తగ్గించడా నికి అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసు ల పరిష్కారానికి మరింత చొరవ చూపాలన్నారు. ఫోక్సో కేసుల్లో విచార ణ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పంక్షనల్‌ వర్జికల్స్‌ ఉత్తమ ప్రతి భను కనబరిచిన అధికారులకు, సిబ్బందికి రివార్డులు అందించారు. ఈ సమావేశంలో జగిత్యాల, మెట్‌పల్లి డీఎస్పీలు ప్రకాశ్‌, రవీంద్ర రెడ్డిలు, ఎస్‌బీ ఇన్స్‌పెక్టర్‌ శ్రీనివాసులు, ఐటీ కోర్‌ ఇన్స్‌పెక్టర్‌ సరిలాల్‌, సీసీఎస్‌ ఇన్స్‌పెక్టర్‌ నాగేశ్వర్‌రావు, సీఐలు రమణమూర్తి, శ్రీనివాస్‌, కోటేశ్వర్‌, కృష్ణకుమార్‌, జిల్లాలోని పలు స్టేషన్లకు చెందిన ఎస్‌ఐలు పాల్గొన్నారు.


Read more