నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2022-11-28T00:48:55+05:30 IST

నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించి శివారుప్రాంతాలతోపాటు అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

కరీంనగర్‌ టౌన్‌, నవంబర్‌ 27: నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించి శివారుప్రాంతాలతోపాటు అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌ తొమ్మిదో డివిజన్‌లో కోటి 14 లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు, ఫిల్టర్‌బెడ్‌ ప్రాంతంలో 2 కోట్ల 50 లక్షలతో చేపట్టనున్న ప్రహరీ, అంతరగ్గత రోడ్లు, డ్రైనేజీ పనులకు మేయర్‌ యాదగిరి సునీల్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఈ డివిజన్‌కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని అన్నారు. పనులు చురుకుగా సాగుతున్నాయని చెప్పారు. ప్రధానంగా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న డంపింగ్‌యార్డు సమస్యకు సీఎం కేసీఆర్‌ సహకారంతో శాశ్వత పరిష్కారం చూపేందుకు పనులు ప్రారంభించామని మంత్రి గంగుల తెలిపారు. అభివృద్ధి పనులన్నీ త్వరగా పూర్తి చేస్తామని, ప్రజలు అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, స్థానిక కార్పొరేటర్‌ ఐలేందర్‌యాదవ్‌, కార్పొరేటర్లు గందె మాధవిమహేశ్‌, దిండిగాల మహేశ్‌, నాయకులు వంగల పవన్‌కుమార్‌, ఎడ్ల అశోక్‌, గాలి రవియాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T00:48:57+05:30 IST