మెరుగైన వైద్యం అందించాలి

ABN , First Publish Date - 2022-02-23T06:39:07+05:30 IST

ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకంతో వస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేకుండా మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ చెన్నమనని రమేష్‌బాబు అన్నారు.

మెరుగైన వైద్యం అందించాలి
ఆసుపత్రికి చెత్తబుట్టలను అందజేస్తున్న ఎమ్మెల్యే రమేష్‌బాబు

- ఎమ్మెల్యే డాక్టర్‌ చెన్నమనేని రమేష్‌బాబు

వేములవాడ టౌన్‌, ఫిబ్రవరి 22 : ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకంతో వస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేకుండా మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ చెన్నమనని రమేష్‌బాబు అన్నారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మంగళవారం అభివృద్ది కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కార్పొరేట్‌ ఆస్పత్రులకు కాలం చెల్లుతోందని, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు మొగ్గు చూపుతున్నారని  అన్నారు.  ఆసుపత్రిలోని అవసరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సంబంది అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో  సీటీస్కాన్‌, ఆక్సిజన్‌ ప్లాంట్‌ వంటి పనులు పూర్తయ్యాయని త్వరలోనే మంత్రి కేటీఆర్‌ చేతుల మీదగా ప్రారంభోత్సవం చేస్తామని తెలిపారు.  కాగా కౌన్సెలర్‌ సిరిగిరి చందు ఆసుపత్రికి చెత్త బుట్టలను వితరణగా ఇవ్వగా  ఎమ్మెల్యే రమేష్‌బాబు ఆసుపత్రి సిబ్బందికి అందించారు.  జడ్పీచైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ, ఆర్డీవో లీలాదేవి, జిల్లా వైద్యాధికారి మురళీదర్‌రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రేగులపాటి మహేష్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కమిటీ సభ్యులు మ్యాకల రవి, రాపెల్లి శ్రీధర్‌, నీలం కళ్యాణిశేఖర్‌, గంగం స్వరూప తదితరులు ఉన్నారు. 

 ఆస్పత్రిని సందర్శించిన కాయకల్ప అధికారులు 

వేములవాడ ఏరియా ఆస్పత్రిని మంగళవారం కాయకల్ప అధికారుల బృందం సందర్శించింది.  పరిసరాలను, పారిశుధ్య పనులను పరిశీలించింది.  బృందంలో బైంసా ఏరియా ఆస్పత్రి డాక్టర్‌ కాశీనాథ్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విజయ్‌, డాక్టర్‌ ప్రియదర్శిని ఉన్నారు. డాక్టర్‌ మహేష్‌రావు, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-23T06:39:07+05:30 IST