పంచాయతీలకు షాక్‌

ABN , First Publish Date - 2022-05-18T05:46:28+05:30 IST

అసలే ఆర్థిక లోటుతో కొట్టుమి ట్టాడుతున్న పంచాయతీలు పవర్‌ షాక్‌ను తట్టుకోలేకపోతున్నాయి.

పంచాయతీలకు షాక్‌

- ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు, నిర్వహణకు తీర్మానాలు

- ఓ సంస్థకు కాంట్రాక్ట్‌ అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం

- ఆర్థికభారం అంటూ వెనకడుగు వేస్తున్న సర్పంచ్‌లు

జగిత్యాల, మే 17 (ఆంధ్రజ్యోతి): అసలే ఆర్థిక లోటుతో కొట్టుమి ట్టాడుతున్న పంచాయతీలు పవర్‌ షాక్‌ను తట్టుకోలేకపోతున్నాయి. పారి శుధ్య కార్మికుల వేతనాలు, విద్యుత్‌ బిల్లులు, ట్రాక్టర్‌ నిర్వహణ వ్యయం, హరితహారం మొక్కల కొనుగోళ్లు ఇలా పలు ఖర్చులతో ఆర్థిక లోటును పంచాయతీలు ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నాయి. గ్రామ పంచాయతీల పై మరో భారం మోపుతూ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రతీ గ్రామ పంచాయతీలలో ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఈఈఎస్‌ఎల్‌) సంస్థకు అప్ప జె ప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ పంచాయతీలు తీ ర్మానాలు అందించాలని ప్రభుత్వం తాజాగా సర్క్యూలర్‌ జారీ చేసింది. అయితే గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేసే బాధ్య తను హైదరాబాద్‌లో ఉన్న సంస్థకు అప్పగించడం ఏమిటని ఆయా గ్రా మ సర్పంచ్‌లు విముఖతను కనబరుస్తున్నారు. ఇప్పటికే ప్రతీ నెల వివి ధ ఖర్చుల రూపంలో గ్రామ పంచాయతీలపై పడుతున్న భారం తడిచి మోపెడవుతోందని అంటున్నారు. ఇందుకు అనుగుణంగా పవర్‌ వ్యయం ఎలా భరించాలని వాపోతున్నారు.

జిల్లాలో పంచాయతీల పరిస్థితి ...

జిల్లాలో 380 గ్రామ పంచాయతీలున్నాయి. గతంలో జిల్లాలో 320 పం చాయతీలుండగా 500 జనాభా దాటిన అనుబంధ గ్రామాలు, తండాలను అప్‌గ్రేడ్‌ చేయడంతో జిల్లాలో ఏర్పడిన 60 పంచాయతీలతో సంఖ్య 380కు చేరింది. మల్లాపూర్‌ సర్పంచ్‌ పదవీ ఖాళీ ఉంది. జిల్లాలో 379 మంది స ర్పంచ్‌లలో పురుషులు 144 మంది, 236 మంది మహిళలు బాధ్యతలను తీసుకున్నారు. ఇందులో 150 మందికి పైగా సర్పంచ్‌లు యువతీ యువ కులున్నారు. జిల్లాలోని పంచాయతీల్లో 3,500 మంది వార్డు సభ్యులు బా ధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

పంచాయతీలకు తడిచి మోపెడవుతున్న వ్యయం...

చిన్న గ్రామ పంచాయతీలకు నెలకు పారిశుధ్య కార్మికుల వేతనాలకు రూ. 25,500, ట్రాక్టర్‌ నిర్వహణ ఖర్చులు రూ. 20 వేలు, వీదిదీపాల ఖర్చు లు రూ. 10 వేలు, హరితహారం మొక్కల నిర్వహణ వ్యయం రూ. 9 వేల వరకు ఉంటుంది. ఈ లెక్కన సుమారు 1500 వరకు జనాభా ఉన్న ఓ చిన్న పంచాయతీ ఖర్చులు నెలకు సుమారు రూ. 80 వేల వరకు ఉం టున్నాయి. యేడాదికి సుమారు రూ. 9.60 లక్షల వరకు ఉంటున్నాయి. 3 వేల జనాభా ఉన్న పంచాయతీలకు యేడాదికి రూ. 14 నుంచి రూ. 15 లక్షల వరకు, 4,500 జనాభా పైబడి ఉన్న పంచాయతీలకు యేడాదికి సు మారు రూ. 21 నుంచి రూ. 22 లక్షలు అవుతోంది. ఏ యేటికి ఆ యేడు పెరిగిపోతున్న ఖర్చులతో గ్రామంలో ప్రజలకు అవసరమైన ఇతర వివిధ రకాల అభివృద్ధి పనులు చేసేందుకు నిధుల కొరత ఏర్పడుతున్నట్లు పం చాయతీ పాలకులు వాపోతున్నారు.

నిధుల విడుదల అంతంతమాత్రమే...

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు విడుదల చేస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా విడుదలవుతున్న నిధులు సక్రమంగా రావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. 1500 జనాభా ఉన్న గ్రామ పంచాయతీకి 15వ ఆర్థిక సంఘం ద్వారా యేడాది రూ. 24.16 లక్షలు విడుదల అవుతుండగా వివిధ రకాల చెల్లింపులు గాను సంవత్సరానికి రూ. 9.50 లక్షలు వ్యయం అవుతు న్నాయి. అదేవిధంగా మురికి కాలువలు, కల్వర్టులు, సీసీ రహదారుల ని ర్మాణాలు, తాగునీటి అవసరాలు, పాఠశాలలు, అంతర్గత రహదారుల మ రమ్మతులు, ఇతర పనులకు మిగిలిన కొద్ది పాటి నిధులను వెచ్చిస్తున్నా రు. పెద్ద పంచాయతీల ఆర్థిక పరిస్థితి సైతం ఇంచుమించుగా ఇదేవిధం గా ఉందని సర్పంచ్‌లు అంటున్నారు.

తీర్మానాలతో అధిక వ్యయ భారం...

ప్రస్తుతం గ్రామ పంచాయతీలను వచ్చే ఏడేళ్లకు ఈఈఎస్‌ఎల్‌ సంస్థ కు వీధి దీపాల బిగింపు, నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తూ తీర్మానాలు అందిస్తే అధిక వ్యయ భారం అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నా యి. వీధి దీపాల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే నిర్వహణ భారం రె ట్టింపు అయ్యే ప్రయాదముందన్న విమర్శలున్నాయి. దీనికి తోడు వీధి దీ పాల నిర్వహణలో రోజు వారీగా తలెత్తే వివిధ రకాల సమస్యలను సంస్థ ఎప్పుడు పరిష్కరిస్తుందని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత సంస్థకు గ్రామాల్లో 18,35,70,110,190 ఓల్డ్స్‌ ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేయడా నికి, నిర్వహణకు అవసరమైన తీర్మానాలు అందించాలని ప్రభుత్వం ఆదే శాలు జారీ చేయడం పట్ల సర్పంచ్‌లు అయిష్టత ప్రదర్శిస్తున్నారు.

పునరాలోలించాలి

మెరుగు రమ్య, సర్పంచ్‌, తిమ్మాపూర్‌, జగిత్యాల మండలం

గ్రామ పంచాయతీల్లో వీధి దీపాల బిగింపు, నిర్వహణ బాధ్యతలను ఓ సంస్థకు అప్పగిస్తూ తీర్మానాలు అందించాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదే శాలపై పునరాలోచన జరపాలి. తీర్మానాలు అందించడం వల్ల భవిష్యత్తు లో పలు ఇబ్బందులు ఎదుర్కొవలసి వచ్చే అవకాశాలున్నాయి.

ఆర్థికంగా కొట్టు మిట్టాడుతున్న పంచాయతీలకు షాక్‌

- జంగ జలందర్‌, సర్పంచ్‌, అనంతారం, జగిత్యాల మండలం

ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్న పంచాయతీలకు విద్యుత్‌ నిర్వహణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం షాక్‌ గురిచేస్తోంది. ప్రభు త్వం పునరాలోచన జరిపి నిర్ణయాన్ని విరమించుకోవాలి. పంచాయతీలు తీర్మానాలు అందించాలని ఇటీవల ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది.

ఆదేశాలు వచ్చాయి

- హరికిషన్‌, జిల్లా పంచాయతీ అధికారి

పంచాయతీల్లో ఎల్‌ఈడీ బల్బుల నిర్వహణకు పాలకవర్గాలు తీర్మానా లు అందించాలని ప్రభుత్వం నుంచి ఇటీవల ఆదేశాలు వచ్చాయి. తీర్మానా లకు పంచాయతీలపై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదు. స్వచ్చందంగా తీర్మానాలు ఇచ్చిన పంచాయతీల నుంచి స్వీకరిస్తున్నాము.

Read more