-
-
Home » Telangana » Karimnagar » Seeing the development they are joining the TRS party-MRGS-Telangana
-
అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు
ABN , First Publish Date - 2022-09-12T05:00:54+05:30 IST
కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల వారు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.

- ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని, సెప్టెంబరు 11: కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల వారు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాల యంలో ఎల్‌బీనగర్‌కు చెందిన 200మంది మహిళలు, 50మంది యువకులు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రవేశపెడు తున్నారని, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షే మ పథకాలపై ఆరా తీస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీ యాలకు రావాలని యావత్ దేశ ప్రజలు చూస్తున్నారని, రాష్ట్రంలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కు తుందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ బంగి అనీల్ కుమార్, కార్పొరేటర్లు రాకం లత, పాముకుంట్ల భాస్కర్, నాయకులు కే మల్లయ్య, జేవీరాజు, రాకం వేణు, సంజీవ్, బక్కి కిషన్, పర్లపల్లి రవి పాల్గొన్నారు.